Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Numbers 1 OTSA

Show OTSA only
Verse × ×
1 Our Father spoke to Moses in the Sinai wilderness, in the tent of meeting, on the first day of the second month of the second year after they left the land of Egypt. He said: ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి రోజు సీనాయి ఎడారిలో ఉన్న సమావేశ గుడారంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు:
2 "Count the whole community of Israel's people, by clans and fathers' houses—every male, by name, head by head. మొత్తం సమాజంలోని ఇశ్రాయేలీయుల వంశాలు కుటుంబాల ప్రకారం వారి జనాభా లెక్కలు నమోదు చేయి.
3 Register everyone in Israel twenty and older who can serve in the army—you and Aaron—by their divisions. నీవూ అహరోను కలిసి ఇశ్రాయేలీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు గలవారు, సైన్యంలో సేవ చేయగలవారిని వారి వారి సేనల ప్రకారం లెక్కించాలి.
4 A man from each tribe is to be with you, each one the head of his family. ప్రతీ గోత్రం నుండి ఒకడు తన కుటుంబానికి పెద్దగా ఉన్న ప్రతీ ఒకడు మీకు సహాయం చేయాలి.
5 "Names of the men who will stand with you: from Reuben, Elizur son of Shedeur. “మీకు సహాయం చేయాల్సిన పురుషుల పేర్లు ఇవి: “రూబేను గోత్రం నుండి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు;
6 "From Simeon, Shelumiel son of Zurishaddai; షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు;
7 "From Judah, Nahshon son of Amminadab; యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను;
8 "From Issachar, Nethanel son of Zuar; ఇశ్శాఖారు గోత్రం నుండి సూయరు కుమారుడైన నెతనేలు;
9 "From Zebulun, Eliab son of Helon; జెబూలూను గోత్రం నుండి హేలోను కుమారుడైన ఏలీయాబు;
10 "From the sons of Joseph: from Ephraim, Elishama son of Ammihud; from Manasseh, Gamaliel son of Pedahzur; యోసేపు కుమారుల నుండి: ఎఫ్రాయిం గోత్రం నుండి అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రం నుండి పెదాసూరు కుమారుడైన గమలీయేలు;
11 "From Benjamin, Abidan son of Gideoni; బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కుమారుడైన అబీదాను;
12 "From Dan, Ahiezer son of Ammishaddai; దాను గోత్రం నుండి అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు;
13 "From Asher, Pagiel son of Ochran; ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కుమారుడైన పగీయేలు;
14 "From Gad, Eliasaph son of Deuel; గాదు గోత్రం నుండి దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు;
15 "From Naphtali, Ahira son of Enan. నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కుమారుడైన అహీర.”
16 "These were the community's called ones, leaders of their ancestral tribes, heads of Israel's clans." వీరు సమాజంలో వారి పితరుల గోత్రాల నుండి నాయకులుగా ఏర్పాటు చేయబడినవారు. వీరు ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు.
17 So Moses and Aaron took these men who had been designated by name, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే అహరోనులు పేర్లు పేర్కొనబడిన వారిని తీసుకుని,
18 on the first day of the second month they gathered the whole community. The people registered their ancestry by clan and family—every male twenty years old and older, listed by name, one by one, రెండవ నెల మొదటి రోజున సమాజమంతటిని సమావేశ పరిచారు. ప్రజలు వారి వారి గోత్రాలు, వారి వారి కుటుంబాల ప్రకారం తమ వంశాన్ని నమోదు చేసుకున్నారు. యిరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సున్న వారు ఒకరి తర్వాత ఒకరి పేరు నమోదు చేశారు.
19 as our Father had commanded Moses. So Moses counted them in the wilderness of Sinai. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే సీనాయి ఎడారిలో వారిని లెక్కించాడు:
20 From Reuben's descendants, Israel's firstborn: recorded by clan and family, name by name, every male twenty years old and up, able to serve in war. ఇశ్రాయేలు మొదటి సంతానమైన రూబేను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
21 Those counted from the tribe of Reuben were 46,500. రూబేను గోత్రం నుండి లెక్కించబడినవారు 46,500.
22 Simeon's descendants, by clans and families, counted by name, head by head: every male twenty years old and up, fit for the army. షిమ్యోను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
23 Those counted from the tribe of Simeon were 59,300. షిమ్యోను గోత్రం నుండి లెక్కించబడినవారు 59,300.
24 From Gad's descendants: by clans, families, and names, every man twenty and older fit for military service. గాదు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
25 Those counted from the tribe of Gad were 45,650. గాదు గోత్రం నుండి లెక్కించబడినవారు 45,650.
26 Judah's descendants, listed by clans and families, by name, every man twenty and older able to serve in the army: యూదా సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
27 those counted from the tribe of Judah were 74,600. యూదా గోత్రం నుండి లెక్కించబడినవారు 74,600.
28 Issachar's descendants, listed by clan and family, by name, every man twenty years and older fit for war: ఇశ్శాఖారు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
29 those counted from the tribe of Issachar were 54,400. ఇశ్శాఖారు గోత్రం నుండి లెక్కించబడినవారు 54,400.
30 Zebulun's descendants: registered by clan and family, by name, every man twenty years old or older fit for military service. జెబూలూను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
31 Those counted from the tribe of Zebulun were 57,400. జెబూలూను గోత్రం నుండి లెక్కించబడినవారు 57,400.
32 Sons of Joseph, Ephraim's line: recorded by clan and family, by name, every man twenty and older fit for military service. యోసేపు కుమారులు: ఎఫ్రాయిం సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
33 Those counted from the tribe of Ephraim were 40,500. ఎఫ్రాయిం గోత్రం నుండి లెక్కించబడినవారు 40,500.
34 Manasseh's descendants, listed by clans and families, by name, each man twenty years or older able to serve in the army: మనష్షే సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
35 those counted from the tribe of Manasseh were 32,200. మనష్షే గోత్రం నుండి లెక్కించబడినవారు 32,200.
36 From Benjamin's descendants, recorded by clan and family, by name, every man twenty years old and older, fit for military service: బెన్యామీను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
37 those counted from the tribe of Benjamin were 35,400. బెన్యామీను గోత్రం నుండి లెక్కించబడినవారు 35,400.
38 From Dan's descendants, listed by clan and family, by name, every man twenty years old and older fit for war: దాను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
39 those counted from the tribe of Dan were 62,700. దాను గోత్రం నుండి లెక్కించబడినవారు 62,700.
40 Asher's descendants, listed by clan and family, by name: every man twenty years old and up, fit for military service. ఆషేరు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
41 Those counted from the tribe of Asher were 41,500. ఆషేరు గోత్రం నుండి లెక్కించబడినవారు 41,500.
42 Naphtali's descendants: by clan and family, counted by name, every man twenty and older fit for war. నఫ్తాలి సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
43 Those counted from the tribe of Naphtali were 53,400. నఫ్తాలి గోత్రం నుండి లెక్కించబడినవారు 53,400.
44 Moses, Aaron, and Israel's twelve leaders counted these men, each for his family. వీరంతా ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల నాయకులతో కలిసి మోషే అహరోనులచేత లెక్కించబడినవారు.
45 All Israel's people were counted by families, every man twenty years old and older, fit to serve in Israel's army. ఇశ్రాయేలీయులందరిలో ఇరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సుండి ఇశ్రాయేలు సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
46 All those counted came to 603,550. వీరి మొత్తం సంఖ్య 6,03,550.
47 But the Levites were not counted among them by their ancestral tribe. అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు.
48 For our Father had said to Moses: యెహోవా మోషేతో ఇలా అన్నారు:
49 "Do not count the tribe of Levi or list them among the Israelites. “లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు.
50 Instead, put the Levites in charge of the tabernacle of the testimony, all its furnishings, and everything belonging to it. They must carry the tabernacle and its furnishings, care for it, and camp around it. దానికి బదులుగా సాక్షి గుడారం లేదా సాక్షి గుడారం మీద, దాని ఉపకరణాల మీద, దానికి సంబంధించిన అన్నిటి మీద లేవీయులను నియమించు. వారు సమావేశ గుడారాన్ని, దాని ఉపకరణాలన్నిటిని మోయాలి; వారు దాని చుట్టూ ఉంటూ దానిని చూసుకోవాలి.
51 When the tabernacle sets out, Levites take it down; when it is pitched, Levites set it up. Any outsider who comes near is to be put to death. సమావేశ గుడారాన్ని తరలించాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దానిని క్రిందికి దించాలి, అలాగే సమావేశ గుడారాన్ని వేయాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దాన్ని వేయాలి. ఇతరులు దానిని సమీపిస్తే వారికి మరణశిక్ష విధించాలి.
52 Israel's people are to camp, each by his own camp, each under his own banner, by their companies. ఇశ్రాయేలీయులు తమ తమ గోత్ర విభజన ప్రకారం సొంత జెండాలతో తమ డేరాలు వేసుకోవాలి.
53 The Levites must camp around the tabernacle of the testimony, so no wrath falls on the Israelite community; the Levites are to guard the tabernacle of the testimony." అయితే నా కోపం ఇశ్రాయేలీయుల సమాజం మీదికి రాకుండా లేవీయులు సాక్షి గుడారం చుట్టూ డేరాలు వేసుకోవాలి. సాక్షి గుడారాన్ని కాపాడే బాధ్యత లేవీయులదే.”
54 The people of Israel did everything our Father had commanded Moses; that is exactly what they did. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు చేశారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]