Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Nehemiah 11 OTSA

Show OTSA only
Verse × ×
1 Leaders lived in Jerusalem; the rest cast lots to bring one of every ten to live in Jerusalem, the holy city, leaving nine-tenths in the towns. ప్రజల నాయకులు యెరూషలేములో స్థిరపడ్డారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకరు మాత్రమే పరిశుద్ధ యెరూషలేములో నివసించేలా మిగతా తొమ్మిదిమంది తమ సొంత పట్టణాల్లోనే నివసించేలా చీట్లు వేశారు.
2 And the people blessed all the men who freely offered to live in Jerusalem. యెరూషలేములో నివసించడానికి ఇష్టపూర్వకంగా వచ్చిన వారిని ప్రజలు దీవించారు.
3 These are the province's leaders who lived in Jerusalem; but in Judah's towns, each lived on his own property, in their towns—Israel, the priests, Levites, temple servants, and Solomon's servants' descendants. యెరూషలేములో స్థిరపడిన ప్రాంతీయ నాయకులు వీరే, (ఇశ్రాయేలీయులలో కొంతమంది, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు యూదా పట్టణాల్లో వివిధ పట్టణాల్లో ఉన్న తమ సొంత స్థలాల్లో నివసించారు,
4 Some descendants of Judah and Benjamin lived in Jerusalem. From Judah: Athaiah son of Uzziah, son of Zechariah, son of Amariah, son of Shephatiah, son of Mahalalel, from the descendants of Perez; యూదా, బెన్యామీను వారిలో మరికొంతమంది యెరూషలేములో నివసించారు): యూదా వారసుల నుండి: అతాయా, ఇతడు పెరెసు వారసుడైన మహలలేలు కుమారుడైన షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడైన జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడు;
5 and Maaseiah son of Baruch, son of Col-hozeh, son of Hazaiah, son of Adaiah, son of Joiarib, son of Zechariah, son of the Shilonite. మయశేయా, ఇతడు షేలా వారసుడైన జెకర్యా కుమారుడైన యోయారీబుకు పుట్టిన అదాయా కుమారుడైన హజాయాకు పుట్టిన కొల్-హోజె కుమారుడైన బారూకు కుమారుడు.
6 All the descendants of Perez who lived in Jerusalem numbered 468 able men. యెరూషలేములో నివసించిన పెరెసు వారసులు 468 మంది, వీరంతా అసాధారణమైన పోరాట యోధులు.
7 From Benjamin: Sallu son of Meshullam, son of Joed, son of Pedaiah, son of Kolaiah, son of Maaseiah, son of Ithiel, son of Jeshaiah, బెన్యామీను వారసుల నుండి: సల్లు, ఇతడు యెషయా కుమారుడైన ఇతీయేలుకు పుట్టిన మయశేయా కుమారుడైన కోలాయాకు పుట్టిన పెదాయా కుమారుడైన యోవేదుకు పుట్టిన మెషుల్లాము కుమారుడు,
8 and after him Gabbai and Sallai—928 in all. అతని అనుచరులైన గబ్బయి సల్లయి అనేవారితో కలిపి 928 మంది.
9 Joel son of Zichri oversaw them; Judah son of Hassenuah was second over the city. జిఖ్రీ కుమారుడైన యోవేలు వీరి అధికారి; హస్సెనూయా కుమారుడైన యూదా ఆ పట్టణపు నూతన భాగానికి ముఖ్య అధికారి.
10 Of the priests: Jedaiah son of Joiarib, Jachin, యాజకుల నుండి: యోయారీబు కుమారుడైన యెదాయా, యాకీను;
11 Seraiah son of Hilkiah, son of Meshullam, son of Zadok, son of Meraioth, son of Ahitub, chief officer of our Father's house; శెరాయా దేవుని ఆలయానికి అధికారిగా ఉన్నాడు. ఇతడు అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడైన మెషుల్లాముకు పుట్టిన హిల్కీయా కుమారుడు;
12 and their brothers who did the house's work: 822; and Adaiah son of Jeroham son of Pelaliah son of Amzi son of Zechariah son of Pashhur son of Malchijah, ఆలయ పని చేసే వీరి బంధువులు 822 మంది; అదాయా, ఇతడు మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన జెకర్యా కుమారుడైన అమ్జీకు పుట్టిన పెలల్యా కుమారుడైన యెరోహాము కుమారుడు.
13 and his brothers, family heads—242; and Amashsai son of Azarel, son of Ahzai, son of Meshillemoth, son of Immer, కుటుంబ పెద్దలుగా ఉన్న వీరి బంధువులు 242 మంది. అమష్షయి, ఇతడు ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమోతుకు పుట్టిన అహజై కుమారుడైన అజరేలు కుమారుడు.
14 and their associates, able warriors—128; their overseer was Zabdiel son of Haggedolim. అతని బంధువులు 128 మంది, వీరు అసాధారణ పోరాట యోధులు. హగ్గేదోలిము కుమారుడైన జబ్దీయేలు వీరి ముఖ్య అధికారి.
15 Of the Levites: Shemaiah son of Hasshub, son of Azrikam, son of Hashabiah, son of Bunni; లేవీయుల నుండి: షెమయా, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కుమారుడైన అజ్రీకాముకు పుట్టిన హష్షూబు కుమారుడు.
16 and Shabbethai and Jozabad, from the heads of the Levites, oversaw the outside work of our Father's house; దేవుని మందిరంలో బయటి పనులకు పర్యవేక్షకులుగా ఉన్న లేవీయుల పెద్దలు షబ్బెతై, యోజాబాదు;
17 and Mattaniah son of Mica, son of Zabdi, son of Asaph, who led in thanksgiving and prayer; Bakbukiah, second among his associates; and Abda son of Shammua, son of Galal, son of Jeduthun. కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన నడిపించే నాయకుడు ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా; అతని సహకారులలో రెండవవాడైన బక్బుక్యా; యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దా.
18 All the Levites in the holy city numbered 284. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీయుల సంఖ్య 284 మంది.
19 The gatekeepers—Akkub, Talmon, and their associates who kept watch at the gates—numbered 172. ద్వారపాలకుల్లో: అక్కూబు, టల్మోను గుమ్మాలను కాపలా కాసేవారి సహాయకులు 172 మంది.
20 The rest of Israel, the priests, and the Levites were in all Judah's towns, each on his inheritance. మిగిలిన ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు యూదా పట్టణాల్లో తమకు కేటాయించిన స్వాస్థ్యంలో నివసించారు.
21 The temple servants lived on Ophel, with Ziha and Gishpa over the temple servants. ఆలయ సేవకులు ఓఫెలు కొండమీద నివసించారు. వీరికి జీహా, గిష్పా అధికారులు.
22 Uzzi son of Bani, son of Hashabiah, son of Mattaniah, son of Mica, of Asaph's descendants, oversaw the Levites in Jerusalem, the singers responsible for the work of our Father's house. యెరూషలేములోని లేవీయులకు ఉజ్జీ అధికారి; ఇతడు మీకా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన హషబ్యా కుమారుడైన బానీ కుమారుడు. దేవుని ఆలయ సేవల బాధ్యత వహించిన సంగీతకారులైన ఆసాపు వారసులలో ఒకడు ఉజ్జీ.
23 For there was a command from the king concerning them, and a fixed daily allowance for the singers. సంగీతకారులు రాజు ఆదేశాల ప్రకారం పని చేయాలి, కాబట్టి వారి దినచర్య క్రమబద్ధం చేయబడింది.
24 Pethahiah son of Meshezabel, of Zerah son of Judah's descendants, was at the king's hand for every matter about the people. యూదా కుమారుడైన జెరహు వారసులలో ఒక్కడైన మెషేజబేలు కుమారుడైన పెతహయా ప్రజలకు సంబంధించిన అన్ని వ్యవహారాలలో రాజుకు సలహాదారునిగా ఉన్నాడు.
25 As for the villages with their fields, some of Judah's descendants lived in Kiriath-arba and its villages, Dibon and its villages, Jekabzeel and its settlements, ఇక గ్రామాలు వాటి పొలాలకు సంబంధించి యూదా ప్రజల్లో కొంతమంది కిర్యత్-అర్బాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, దీబోనులో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, యెకబ్సెయేలులో దాని గ్రామాల్లో,
26 in Jeshua, in Moladah, in Beth-pelet, యెషూవలో, మొలాదాలో, బేత్-పెలెతులో,
27 in Hazar-shual, in Beersheba and its villages, హజర్-షువలులో, బెయేర్షేబలో వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో,
28 in Ziklag, in Meconah and its villages, సిక్లగులో, మెకోనాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో,
29 in En-rimmon, in Zorah, in Jarmuth, ఎన్-రిమ్మోనులో, జోరహులో, యర్మూతులో,
30 Zanoah, Adullam and their villages, Lachish and its fields, Azekah and its villages. So they settled from Beersheba to the Hinnom Valley. జానోహలో, అదుల్లాములో వాటి గ్రామాల్లో, లాకీషులో దానికి పొలాల్లో అజేకాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో నివసించారు. వారు బెయేర్షేబ నుండి హిన్నోము లోయవరకు నివసించారు.
31 The descendants of Benjamin lived from Geba onward, at Michmash, Aija, Bethel and its villages, గెబాలో స్థిరపడిన బెన్యామీనీయులు మిక్మషులో, అయ్యాలో, బేతేలు వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో,
32 Anathoth, Nob, Ananiah, అనాతోతులో, నోబులో, అనన్యాలో,
33 Hazor, Ramah, Gittaim, హాసోరులో, రామాలో, గిత్తయీములో,
34 Hadid, Zeboim, Neballat, హదీదులో, సెబోయిములో, నెబల్లాటులో,
35 Lod, and Ono, the Valley of Craftsmen. లోదులో, పనివారి లోయ అని పిలిచే ఓనోలో నివసించారు.
36 And some divisions of the Levites from Judah were assigned to Benjamin. యూదాలోని లేవీయులలో కొన్ని గుంపులు బెన్యామీనులో నివసించారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]