Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Lamentations 3 OTSA

Show OTSA only
Verse × ×
1 I am the man who has seen affliction under the rod of his wrath. యెహోవా ఉగ్రత కర్ర చేత నేను బాధను అనుభవించిన వాన్ని.
2 He has driven me away and made me walk in darkness without any light. ఆయన నన్ను వెళ్లగొట్టి, వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు.
3 Surely against me he turns his hand again and again, all day long. నిజానికి, ఆయన రోజంతా మాటిమాటికి నా మీద తన చేయి ఆడిస్తానే ఉన్నారు.
4 He has worn away my flesh and my skin; he has broken my bones. ఆయన నా చర్మాన్ని, నా మాంసాన్ని క్షీణించిపోయేలా చేసి నా ఎముకలను విరగ్గొట్టారు.
5 He has besieged me and surrounded me with bitterness and hardship. ఆయన నన్ను ముట్టడించి, విషంతో కఠినత్వంతో నన్ను చుట్టుముట్టారు.
6 He has made me dwell in darkness like those long dead. ఎప్పుడో చనిపోయినవారు పడి ఉన్నట్లుగా ఆయన నన్ను చీకటిలో పడి ఉండేలా చేశారు.
7 He has walled me in so I cannot escape; he has weighed down my chains. నేను తప్పించుకోకుండా ఆయన నా చుట్టూ గోడ కట్టించారు; బరువైన గొలుసులతో ఆయన నన్ను బంధించారు.
8 Even when I call out and cry for help, he shuts out my prayer. నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు.
9 He has blocked my ways with cut stones; he has made my paths crooked. ఆయన రాళ్లను నా దారికి అడ్డుపెట్టారు; ఆయన నా మార్గాలను వంకర చేశారు.
10 He is a bear lying in wait for me, a lion in hiding. పొంచి ఉన్న ఎలుగుబంటిలా, దాక్కున్న సింహంలా,
11 He drove me off my path and tore me to pieces; he has made me desolate. ఆయన నన్ను దారిలో నుండి ఈడ్చుకెళ్లి, నన్ను ముక్కలు చేసి, నిస్సహాయ స్థితిలో వదిలేశారు.
12 He bent his bow and set me as the target for his arrow. ఆయన తన విల్లు తీసి, తన బాణాలకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు.
13 He drove the arrows of his quiver into my vitals. ఆయన తన అంబుల పొదిలోని బాణాలతో, నా గుండెను గుచ్చారు.
14 I have become the laughingstock of all my people, their mocking song all day long. నేను నా ప్రజలందరికి నవ్వులాటగా మారాను; రోజంతా వారు పాటలో నన్ను హేళన చేస్తున్నారు.
15 He has filled me with bitterness; he has sated me with bitterness. ఆయన నాతో చేదు మూలికలు తినిపించారు, త్రాగడానికి చేదు పానీయాన్ని ఇచ్చారు.
16 He has made my teeth grind on gravel, and made me cower in the dust. ఆయన రాళ్లతో నా పళ్లను విరగ్గొట్టారు; నన్ను దుమ్ములో త్రొక్కారు.
17 My soul has lost all peace; I have forgotten what happiness is. సమాధానం నాకు దూరమైంది, అభివృద్ధి అంటే ఏంటో మరచిపోయాను.
18 So I say, "My endurance has perished, and so has my hope from our Father." కాబట్టి, “నా వైభవం పోయింది, యెహోవా నుండి నేను ఆశించినవన్నీ పోయాయి” అని నేనన్నాను.
19 Remember my affliction and my wandering, the bitterness and the gall! నా శ్రమ, నా నిరాశ్రయ స్థితి, నేను త్రాగిన చేదు పానీయం జ్ఞాపకం చేసుకోండి.
20 My soul continually remembers it and is bowed down within me. నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను, నా ప్రాణం నాలో కృంగి ఉంది.
21 But this I call to mind, and therefore I have hope: అయినప్పటికీ నేను ఇది జ్ఞాపకం చేసుకుంటాను, కాబట్టి నాకు నిరీక్షణ ఉంది:
22 The covenant love of our Father never ceases; his mercies never come to an end; యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు, ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు.
23 they are new every morning; great is your faithfulness. ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి; మీ నమ్మకత్వం గొప్పది.
24 "Our Father is all I need," says my soul, "therefore I will hope in him." నాలో నేను, “యెహోవా నా స్వాస్థ్యం; కాబట్టి నేను ఆయన కోసం వేచి ఉంటాను” అని అనుకుంటున్నాను.
25 Our Father is good to those who wait for him, to the soul who seeks him. తన మీద నిరీక్షణ కలిగి ఉన్నవారికి, తనను వెదికేవారికి యెహోవా మేలు చేస్తారు;
26 It is good to wait quietly for the salvation of our Father. యెహోవా రక్షణ కోసం ఓపికతో వేచి ఉండడం మంచిది.
27 It is good for a man to bear the yoke in his youth. ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు.
28 Let him sit alone in silence when it is laid on him; యెహోవాయే దాన్ని అతని మీద ఉంచారు, కాబట్టి అతడు ఒంటరిగా మౌనంగా కూర్చోవాలి.
29 let him put his mouth in the dust—there may yet be hope; అతడు తన ముఖం ధూళిలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా నిరీక్షణ ఉండవచ్చు.
30 let him give his cheek to the one who strikes, and be filled with insults. తనను కొట్టేవానికి తన చెంపను చూపించి, నిండా అవమానం పాలుకానివ్వు.
31 For the Sovereign Father will not abandon forever. ఎవ్వరూ ప్రభువుచేత శాశ్వతంగా త్రోసివేయబడరు.
32 Though he causes grief, he will have compassion according to the abundance of his covenant love; ఆయన దుఃఖం కలిగించినప్పటికీ, ఆయన కనికరం చూపుతారు, ఆయన మారని ప్రేమ చాలా గొప్పది.
33 for he does not willingly afflict or grieve people. ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు.
34 To crush underfoot all the prisoners of the earth, దేశంలో ఖైదీలందరిని, కాళ్లక్రింద పడేసి త్రొక్కాలని,
35 to deny a man justice in the sight of the Most High, మహోన్నతుని ఎదుట, ప్రజలు తమ హక్కులను త్రోసిపుచ్చాలని,
36 to deprive a man of justice in his case—the Sovereign Father does not approve. ఒక వ్యక్తికి న్యాయం జరగకుండా చేయడం, ఇలాంటివి ప్రభువు చూడరా?
37 Who has spoken and it came to pass, unless the Sovereign Father has commanded it? ప్రభువు శాసించనప్పుడు అది జరిగేలా ఎవరు ఆజ్ఞాపించగలరు?
38 Is it not from the mouth of the Most High that both calamity and good come? మహోన్నతుని నోటి నుండి వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా?
39 Why should a living man complain about the punishment for his sins? తమ పాపాలను బట్టి శిక్షించబడినప్పుడు సజీవులైన మనుష్యులు ఎందుకు ఫిర్యాదు చేయాలి?
40 Let us examine and test our ways, and return to our Father! మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.
41 Let us lift up our hearts and our hands to our Father in heaven: మన హృదయాలను, చేతులను పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి:
42 "We have sinned and rebelled, and you have not forgiven. “మేము పాపం చేశాము, తిరుగుబాటు చేశాము మీరు క్షమించలేదు.
43 You have wrapped yourself in anger and pursued us, killing without pity; “మీరు కోపంతో కప్పుకుని మమ్మల్ని వెంటాడారు; మీరు జాలి లేకుండా చంపారు.
44 you have wrapped yourself with a cloud so that no prayer can pass through. ఏ ప్రార్థన ఫలించకుండా, మీరు ఒక మేఘంతో మిమ్మల్ని మీరు కప్పుకున్నారు.
45 You have made us scum and refuse among the peoples. దేశాల మధ్య మీరు మమ్మల్ని చెత్తగా చేశారు.
46 All our enemies open their mouths against us; “మా శత్రువులందరూ మాకు వ్యతిరేకంగా నోరు తెరిచారు.
47 panic and pitfall have come upon us, devastation and destruction." మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము, పతనము నాశనము.”
48 My eyes flow with streams of water over the destruction of my people. నా ప్రజలు నాశనమయ్యారు కాబట్టి నా కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తాయి.
49 My eyes will flow without ceasing, without respite, యెహోవా పరలోకం నుండి క్రిందికి వంగి చూసే వరకు, ఉపశమనం లేకుండా, నా కంటి నుండి నీరు ఎడతెగకుండా ప్రవహిస్తుంది.
50 until our Father looks down and sees from heaven. Not in this edition
51 My eyes bring grief to my soul at the fate of all the daughters of my city. నా నగర స్త్రీలందరి వల్ల నేను చూసేది నా ప్రాణానికి దుఃఖం కలిగిస్తుంది.
52 I have been hunted like a bird by those who were my enemies without cause; కారణం లేకుండా నాకు శత్రువులుగా ఉన్నవారు పక్షిలా నన్ను వేటాడారు.
53 they flung me alive into a pit and cast stones on me; వారు గొయ్యిలో వేసి నా ప్రాణం తీయాలని చూశారు, నాపై రాళ్లు విసిరారు;
54 water closed over my head; I said, "I am lost." నీరు నా తలపై మూసుకుపోయాయి, నేను నశిస్తానని అనుకున్నాను.
55 I called on your name, my Father, from the depths of the pit; యెహోవా, నీ నామమున మొరపెట్టాను, గొయ్యి లోతుల్లో నుండి నీ నామాన్ని పిలిచాను.
56 you heard my plea: "Do not turn a deaf ear to my cry for help!" “మీరు నా మొరను ఆలకించారు, నీ చెవులు మూసుకోకు” అనే నా విన్నపాన్ని మీరు విన్నారు.
57 You came near on the day I called on you; you said, "Do not fear!" నేను నిన్ను పిలిచినప్పుడు మీరు దగ్గరికి వచ్చి “భయపడకు” అన్నారు.
58 You have taken up my cause, Sovereign Father; you have redeemed my life. ప్రభువా, నీవు నా కేసు తీసుకున్నావు. నీవు నా ప్రాణాన్ని విమోచించావు.
59 You have seen the wrong done to me, my Father; judge my cause. యెహోవా చూశావు. నా కారణాన్ని సమర్థించండి!
60 You have seen all their vengeance, all their plots against me. వారి ప్రతీకార తీవ్రతను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన కుట్రలన్నీ మీరు చూశారు.
61 You have heard their taunts, my Father, all their plots against me, యెహోవా, వారి అవమానాలను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన పన్నాగాలన్నీ మీరు విన్నారు.
62 the lips and thoughts of my assailants against me all day long. నా శత్రువులు రోజంతా నాకు వ్యతిరేకంగా గుసగుసలాడే గొణుగుతున్నారు.
63 Watch their every move; I am the object of their mocking song. వాటిని చూడు! కూర్చున్నా, నిలబడినా తమ పాటల్లో నన్ను వెక్కిరిస్తారు.
64 You will repay them, my Father, according to the work of their hands. యెహోవా వారి క్రియా కలపలను బట్టి, ప్రతీకారం చేస్తావు.
65 You will give them hardness of heart; your curse will be on them. వారికి కాఠిన్యమైన హృదయాలు ఇవ్వండి, మీ శాపం వారి మీదికి వచ్చును గాక.
66 You will pursue them in anger and destroy them from under the heavens of our Father. కోపంతో వారిని వెంటాడి, యెహోవా ఆకాశాల క్రిందనుండి వారిని నాశనం చేయండి.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]