Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Judges 21 OTSA

Show OTSA only
Verse × ×
1 Israel's men had sworn at Mizpah: "None of us will give his daughter to Benjamin as a wife." ఇశ్రాయేలీయులు మిస్పాలో, “మనలో ఎవ్వరూ బెన్యామీనీయులకు తమ కుమార్తెలను పెళ్ళికి ఇవ్వకూడదు” అని ప్రమాణం చేసుకున్నారు.
2 The people came to Bethel and sat there before our Father until evening, crying out and weeping bitterly. ప్రజలు బేతేలుకు వెళ్లి అక్కడ సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో కూర్చుని ఎంతగానో ఏడ్చారు.
3 They said, "Why, our Father, God of Israel, has this happened in Israel—one tribe missing from Israel today?" “యెహోవా! ఇశ్రాయేలు దేవా! ఇశ్రాయేలుకు ఇలా ఎందుకు జరిగింది? ఈ రోజు ఇశ్రాయేలు గోత్రాల్లో ఎందుకని ఒక గోత్రం అంతరించిపోవలసి వచ్చింది?” అంటూ ఏడ్చారు.
4 The people rose early next day, built an altar there, and offered burnt and peace offerings. మరుసటిరోజు ప్రొద్దున్నే వారు ఒక బలిపఠం కట్టి దాని మీద దహనబలులు, సమాధానబలులు అర్పించారు.
5 Then Israel's people asked, "Which of all the tribes of Israel did not come up to the assembly, to our Father?" For they had sworn a solemn oath that whoever did not come up to our Father at Mizpah must surely be put to death. అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని వారున్నారా?” అని అడిగారు. ఎందుకంటే ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాకపోతే వారికి మరణశిక్ష విధించాలని శపథం చేశారు.
6 The Israelites grieved for their brother Benjamin. They said, "Today one tribe is cut off from Israel. అప్పుడు వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీను గోత్రం గురించి బాధపడుతూ, “ఇశ్రాయేలులో ఈ రోజు ఒక గోత్రం అంతరించి పోయింది.
7 How can we get wives for the survivors, since we swore by our Father not to give them our daughters?" వారికి మన కుమార్తెలను ఇవ్వవద్దని మనం యెహోవా పేరట శపథం చేశాం, మరి మిగిలిన వారికి భార్యలను ఎక్కడ చూడగలం?” అనుకున్నారు.
8 Then they asked, "Which of the tribes of Israel did not come up to our Father at Mizpah?" No one from Jabesh-gilead had come to the camp, to the assembly. తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు.
9 For when the people were counted, not one of the inhabitants of Jabesh-gilead was there. ప్రజలందరినీ లెక్కపెట్టినప్పుడు, యాబేషు గిలాదు నుండి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు.
10 The assembly sent 12,000 of their bravest fighters there, ordering: "Go strike the residents of Jabesh-gilead with the sword, including women and children. అప్పుడు సమాజం పన్నెండువేలమంది యుద్ధవీరులను యాబేషు గిలాదుకు పంపతూ, అక్కడికి వెళ్లి అక్కడి వారినందరిని, స్త్రీలు పిల్లలతో సహితం ఖడ్గంతో చంపాలని ఆదేశించారు.
11 Do this: devote to destruction every male, and every woman who has had relations with a man." వారు, “మీరు ఏం చేయాలంటే, ప్రతి పురుషుని, కన్య కాని ప్రతి స్త్రీని నాశనం చేయండి” అని వారు అన్నారు.
12 Among Jabesh-gilead's residents they found 400 young virgins who had never slept with a man, and brought them to the camp at Shiloh, in the land of Canaan. వారు అక్కడ యాబేషు గిలాదు ప్రజల్లో పురుషులతో పడుకోని నాలుగువందలమంది యువతులను కనుగొన్నారు, వారిని కనానులోని షిలోహు దగ్గర ఉన్న శిబిరానికి తీసుకెళ్లారు.
13 Then the whole community sent word to the Benjaminites at the rock of Rimmon and declared peace to them. అప్పుడు సమాజమంతా రిమ్మోను బండ దగ్గర ఉన్న బెన్యామీనీయులతో సమాధానపడదాం అని కబురు పంపారు.
14 Benjamin returned at that time; they gave them the women kept alive from Jabesh-gilead—still not enough for them all. ఆ సమయంలో బెన్యామీనీయులు తిరిగి వచ్చారు, యాబేషు గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చినవారిని వారికిచ్చి పెళ్ళిళ్ళు చేశారు. అయితే వారందరికీ ఆ స్త్రీలు సరిపోలేదు.
15 The people grieved for Benjamin, because our Father had made a breach in the tribes of Israel. యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో లోపం కలుగజేశారని ప్రజలు బెన్యామీను విషయం బాధపడ్డారు.
16 The elders of the assembly said, "How do we get wives for the survivors, since Benjamin's women were wiped out?" అప్పుడు సమాజపెద్దలు, “బెన్యామీను గోత్రంలో స్త్రీలు లేకుండా నాశనమై పోయినందుకు, వారిలో మిగిలిన వారిని భార్యలను ఎలా తేగలం?
17 They said, "Benjamin's survivors need an inheritance, so a tribe isn't erased from Israel. ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రం తుడిచిపెట్టుకుపోకుండ బెన్యామీను గోత్రంలో మిగిలిన వారికి వారసులుండాలి.
18 We cannot give them our daughters as wives, for Israel had sworn, 'Cursed is anyone who gives a wife to Benjamin.'" వారికి మన కుమార్తెలను భార్యలుగా ఇవ్వలేం, ఎందుకంటే ఇశ్రాయేలీయులమైన మనం, ‘ఎవరైనా బెన్యామీనీయునికి తమ కుమార్తెను భార్యగా ఇస్తే వారు శాపగ్రస్తులు’ అని ప్రమాణం చేశాము.
19 They said, "There's a yearly feast of our Father at Shiloh, north of Bethel, east of the road up from Bethel to Shechem, south of Lebonah." అయితే చూడండి, షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది; షిలోహు బేతేలుకు ఉత్తరాన, బేతేలు నుండి షెకెముకు వెళ్లే దారికి తూర్పున, లెబోనాకు దక్షిణాన ఉన్న షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది” అని అన్నారు.
20 And they instructed the Benjaminites, "Go and hide in the vineyards. అప్పుడు వారు బెన్యామీనీయులను ఇలా ఆదేశించారు: “అక్కడికి వెళ్లి ద్రాక్షతోటల్లో దాక్కుని
21 Watch—when Shiloh's young women come out to dance, rush from the vineyards, each seize a wife from Shiloh's young women, and go to Benjamin's land. వేచి ఉండండి. షిలోహు నుండి యువతులు నాట్యంలో పాల్గొనడానికి వస్తున్నప్పుడు, మీరు ద్రాక్షతోటల్లో నుండి త్వరగా వచ్చి, ప్రతివాడును షిలోహు యువతులలో ఒక యువతిని పెళ్ళి చేసుకోడానికి తీసుకెళ్లండి. తర్వాత బెన్యామీను ప్రదేశానికి తిరిగి వెళ్లండి.
22 When their fathers or brothers come to us to complain, we'll tell them, Show them favor for our sake, since we didn't capture a wife for each in battle, and you didn't give them wives yourselves—else you'd be guilty now." వారి తండ్రులు గాని సోదరులు గాని మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే, మేము వారితో, ‘యుద్ధ సమయంలో వారికి మేము భార్యలను తీసుకురాలేదు, కాబట్టి మీరు మా పట్ల దయచూపి వారికి సహాయం చెయ్యండి. మీ అంతట మీరు మీ కుమార్తెలను వారికివ్వలేదు, కాబట్టి మీరు ప్రమాణం విషయంలో అపరాధులు కారు’ అని చెప్తాము.”
23 So Benjamin's sons did this: they took wives, one for each, from the dancers they seized, went back to their inheritance, rebuilt the cities, and lived there. కాబట్టి బెన్యామీనీయులు అలాగే చేశారు. యువతులు నాట్యం చేస్తూ ఉంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క యువతిని పట్టుకుని తనకు భార్యగా చేసుకున్నాడు. తర్వాత వారు తమ వారసత్వ భూమికి తిరిగివెళ్లి పట్టణాలను మళ్ళీ కట్టి వాటిలో స్థిరపడ్డారు.
24 At that time the Israelites left there, each to his tribe and clan; each went out from there to his inheritance. ఆ తర్వాత ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరు అక్కడినుండి తమ తమ గోత్రాలకు, వంశాలకు, తమ వారసత్వ భూమికి వెళ్లిపోయారు.
25 In those days there was no king in Israel; everyone did what was right in his own eyes. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు; ప్రతి ఒక్కరూ తమకు సరియైనదని అనిపించింది చేసేవారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]