Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Judges 18 OTSA

Show OTSA only
Verse × ×
1 In those days Israel had no king. The tribe of Dan was seeking territory to settle in, for until then no inheritance had fallen to them among the tribes of Israel. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు. ఆ రోజుల్లో దాను గోత్రికులు తాము స్థిరపడడానికి ఒక స్థలం కోసం వెదుకుతున్నారు, ఎందుకంటే ఇశ్రాయేలు గోత్రాల్లో అప్పటికింకా వారికి వారసత్వం లభించలేదు.
2 The Danites sent five brave men from their clan, from Zorah and Eshtaol, to scout and explore the land. They told them, "Go, explore the land." They reached the hill country of Ephraim, to Micah's house, and stayed the night there. కాబట్టి దానీయులు తమ వంశాల నుండి అయిదుగురు సమర్థులైన యోధులను ఎన్నుకుని దానీయులందరి తరుపున జోరహు నుండి ఎష్తాయోలు నుండి దేశాన్ని పరిశీలించడానికి పంపి వారితో, “మీరు వెళ్లి దేశాన్ని పరిశీలించి రండి” అని అన్నారు. కాబట్టి వారు ఎఫ్రాయిం కొండసీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చి అక్కడే ఆ రాత్రి గడిపారు.
3 Near Micah's house they recognized the young Levite's voice, so they turned in there and said to him, "Who brought you here? What are you doing in this place? What do you have here?" వారు మీకా ఇంటిని సమీపించినప్పుడు, యువకుడైన లేవీయుని స్వరం గుర్తుపట్టి, అతని దగ్గరకు వెళ్లి అతనితో, “నిన్ను ఇక్కడకు ఎవరు తీసుకువచ్చారు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగారు.
4 He told them, "Micah did such and such for me; he hired me, and I became his priest." అతడు మీకా తనకు చేసిందంతా వారికి చెప్తూ, “అతడు నన్ను జీతానికి పెట్టుకున్నాడు, నేను అతని యాజకుడిని” అని అన్నాడు.
5 They said to him, "Please ask our Father, so we'll know whether the journey we're taking will succeed." అప్పుడు వారు అతనితో, “మా ప్రయాణం సఫలమవుతుందో లేదో దయచేసి దేవుని దగ్గర విచారించి మాకు చెప్పు” అని అన్నారు.
6 The priest told them, "Go in peace. Your journey is under the watch of our Father." యాజకుడు వారికి జవాబిస్తూ, “క్షేమంగా వెళ్లండి, మీ ప్రయాణానికి యెహోవా యొక్క ఆమోదం ఉంది” అన్నాడు.
7 So the five men went to Laish and saw its people living safely, like the Sidonians—quiet and secure—lacking nothing in the land and possessing wealth. They were far from the Sidonians and had no dealings with anyone. కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు ప్రయాణిస్తూ లాయిషుకు వచ్చి అక్కడి ప్రజలు సీదోనీయుల్లా సమాధానం భద్రత కలిగి క్షేమంగా జీవించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని వారిని బాధించేవారు ఎవరూ లేరని, వారు వృద్ధి చెందుతున్నారని చూశారు. అంతేకాక వారు సీదోనీయులకు దూరంగా ఉంటూ ఎవరితో సంబంధం లేకుండా ఉండడం చూశారు.
8 When they returned to their relatives at Zorah and Eshtaol, they were asked, "What did you find?" వారు జోరహుకు ఎష్తాయోలుకు తిరిగి వచ్చినప్పుడు, వారి తోటి దానీయులు, “మీరు ఏం తెలుసుకున్నారు?” అని వారిని అడిగారు.
9 They said, "Get up, let's attack them! We've seen the land—it's very good. Will you do nothing? Don't delay to go take the land. వారు జవాబిస్తూ, “పదండి, వారి మీద దాడి చేద్దాం! ఆ ప్రాంతాన్ని చూశాం, అది చాలా బాగుంది. ఇంకా వేచి ఉండడం ఎందుకు? వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి ఆలస్యం చేయవద్దు,
10 When you arrive, you'll reach an unsuspecting people in a spacious land. Our Father has handed it to you—a place lacking nothing on earth." మీరు అక్కడికి చేరిన తర్వాత ధైర్యంగా ఉన్న జనాన్ని విశాల ప్రదేశాన్ని, ఏ కొరత లేని స్థలాన్ని మీరు చూస్తారు, దానిని దేవుడు మీ చేతులకు అప్పగిస్తారు” అన్నారు.
11 600 men of the Danite clan, armed with weapons of war, set out from Zorah and Eshtaol. అప్పుడు దాను గోత్రం నుండి ఆరువందలమంది యుద్ధం చేయడానికి ఆయుధాలు ధరించి జోరహు, ఎష్తాయోలు నుండి బయలుదేరారు.
12 They went up and camped at Kiriath-jearim in Judah. That is why it's called Mahaneh-dan to this day; it lies west of Kiriath-jearim. వారు ప్రయాణమై యూదాలోని కిర్యత్-యారీము దగ్గర మకాం చేశారు. అందుకు ఈనాటికీ కిర్యత్-యారీముకు పడమరగా ఉన్న స్థలాన్ని మహానే-దాను అంటారు.
13 From there they crossed to the hill country of Ephraim and reached Micah's house. వారు అక్కడినుండి ఎఫ్రాయిం కొండ సీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చారు.
14 Then the five men who had scouted the land of Laish said to their relatives, "Do you know these houses hold an ephod, household idols, a carved image, and a cast idol? Now decide what to do." అప్పుడు లాయిషు ప్రాంతానికి వేగులవారిగా వెళ్లిన ఆ అయిదుగురు తమ తోటి దానీయులతో, “ఈ ఇళ్ళలో ఒక ఇంట్లో ఏఫోదు, కొన్ని గృహదేవతలు, వెండితో పొదిగించిన విగ్రహం ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడు ఏమి చేయాలో ఆలోచించండి” అన్నారు.
15 So they turned in and came to the young Levite's house, Micah's house, and greeted him. కాబట్టి వారు తిరిగి ఆ లేవీ యువకుడు నివసిస్తున్న మీకా ఇంటికి వెళ్లి, అతన్ని క్షేమసమాచారం అడిగారు.
16 The 600 armed Danite men stood at the gate's entrance. ద్వారం దగ్గర యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది దానీయులు నిలబడ్డారు.
17 The five men who had scouted the land went in and took the carved image, the ephod, the household idols, and the cast idol, while the priest stood at the gate entrance with the 600 armed men. యాజకుడు, యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, దేశాన్ని పరిశోధించడానికి వెళ్లిన ఆ అయిదుగురు మనుష్యులు లోనికి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును గృహదేవతలను తీసుకున్నారు.
18 When these men entered Micah's house and took the carved image, ephod, household idols, and cast idol, the priest asked them, "What are you doing?" ఆ అయిదుగురు మీకా ఇంట్లోకి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును, గృహదేవతలను తీసుకున్నప్పుడు, ఆ యాజకుడు, “మీరు ఏం చేస్తున్నారు?” అని వారిని అడిగాడు.
19 They said, "Quiet! Put your hand on your mouth, come with us. Be our father and priest. Better for you to be priest to one man's house, or to a tribe and clan in Israel?" వారు అతనితో, “నోరు మూసుకో! ఒక్క మాట మాట్లాడకుండ మాతో వచ్చి మాకు తండ్రిగా యాజకునిగా ఉండు. ఒక మనిషి కుటుంబానికి మాత్రమే యాజకునిగా ఉండడం కంటే ఇశ్రాయేలులో ఒక గోత్రమంతటికి, కుటుంబానికి యాజకునిగా ఉండడం మంచిది కాదా?” అన్నారు.
20 The priest's heart was glad. He took the ephod, household idols, and carved image, and went among the people. యాజకుడు చాలా సంతోషించాడు. అతడు ఏఫోదును, గృహదేవతలను, విగ్రహాన్ని తీసుకుని ఆ ప్రజలతో వెళ్లాడు.
21 Then they turned and set out, putting the children, the livestock, and their goods in front of them. వారు తమ చిన్న పిల్లలను, పశువులను, ఆస్తులను ముందుగా పెట్టుకొని అక్కడినుండి బయలుదేరారు.
22 When they had left Micah's house, the men near it were summoned and caught up with the Danites. వారు మీకా ఇంటి నుండి కొంత దూరం వెళ్లాక, మీకా పొరుగువారు సమకూడి దానీయుల వెంటపడ్డారు.
23 They shouted to the Danites, who turned and said to Micah, "What's wrong with you, calling out your men?" వారు కేకలు వేస్తుండగా, దానీయులు తిరిగి మీకాను, “నీ మనుష్యులను పోరాడడానికి పిలిచావు, నీకేమి కావాలి?” అని అడిగారు.
24 He said, "You took the gods I made and the priest, and left. What do I have left? How can you ask me, 'What's wrong with you?'" మీకా జవాబిస్తూ, “నేను చేసిన దేవుళ్ళను, నా యాజకుని మీరు తీసుకెళ్లారు. ఇక నా దగ్గర ఏముంది? ‘ఏంటి విషయం?’ అని నన్ను అడుగుతారేంటి?” అన్నాడు.
25 The Danites told him, "Don't let your voice be heard among us, or angry men will attack you, and you'll lose your life and your household's lives." దానీయులు అతనితో అన్నారు, “మాతో వాదించకు; కోపంతో మా మనుష్యుల్లో కొందరు నీపై దాడి చేసి నిన్ను నీ కుటుంబాన్ని చంపుతారు.”
26 The Danites went on their way; and when Micah saw they were too strong for him, he turned back home. కాబట్టి దానీయులు తమ దారిన తాము వెళ్లిపోయారు. వారు అతనికంటే బలంగా ఉన్నారని గ్రహించి, మీకా తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.
27 They took what Micah had made, and his priest, and came to Laish—a quiet, unsuspecting people—struck them with the edge of the sword, and burned the city with fire. దానీయులు మీకా తయారుచేసుకున్న వాటిని, అతని యాజకుడిని తీసుకుని లాయిషుపై, సమాధాన భద్రతలతో ఉన్న ప్రజలను చేరుకున్నారు. వారిపై ఖడ్గంతో దాడి చేసి, పట్టణాన్ని తగలబెట్టారు.
28 No one could rescue them, for the city lay far from Sidon with no ties to anyone. It sat in the valley that belongs to Beth-rehob. The Danites rebuilt the city and settled there. ఆ ప్రజలు సీదోనుకు దూరంగా ఉండడం, ఎవరితో సంబంధం లేకపోవడం చేత వారిని కాపాడే మనుష్యులే లేరు. ఆ పట్టణం బేత్-రెహోబు దగ్గర లోయలో ఉంది. దానీయులు ఆ పట్టణాన్ని పునర్నిర్మించి అక్కడ స్థిరపడ్డారు.
29 They named the city Dan, after their ancestor Dan, Israel's son; but the city was formerly named Laish. దానికి ఇశ్రాయేలు కుమారుడైన దాను అని తమ పూర్వికుడైన దాను పేరు పెట్టారు; మొదట ఆ పట్టణం లాయిషు అని పిలువబడేది.
30 The Danites set up the carved image for themselves. Jonathan, son of Gershom, son of Moses, and his sons were priests to the tribe of the Danites until the day of the land's captivity. అక్కడ దానీయులు తమ కోసం ఆ విగ్రహాన్ని నిలుపుకున్నారు. దేశం చెరగా అయ్యేవరకు, మోషే కుమారుడు గెర్షోము యొక్క కుమారుడైన యోనాతాను, అతని కుమారులు దాను గోత్రానికి యాజకులుగా ఉన్నారు.
31 They set up for themselves the carved image Micah had made, the whole time the house of our Father was at Shiloh. షిలోహులో దేవుని మందిరం ఉన్న కాలమంతా వారు మీకా చేసిన విగ్రహాన్ని పూజించారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]