Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Judges 13 OTSA

Show OTSA only
Verse × ×
1 Again the Israelites did evil in our Father's eyes, so he gave them into the Philistines' hand for forty years. ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, కాబట్టి యెహోవా వారిని నలభై సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు.
2 A man named Manoah, from Zorah of the Danite clan, had a barren wife who bore no children. జోరహులో దాను వంశానికి చెందిన మనోహ అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య గొడ్రాలు కాబట్టి ఆమెకు పిల్లలు లేరు.
3 The messenger of our Father appeared to the woman and said to her, "You are barren, childless, but will conceive and bear a son. యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, “నీవు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, అయితే నీవు గర్భం ధరించి కుమారునికి జన్మనిస్తావు.
4 Now then, be careful not to drink wine or strong drink, and do not eat anything unclean, కాబట్టి నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకుండ జాగ్రతపడాలి, అపవిత్రమైనది ఏది తినకూడదు.
5 for you will conceive and bear a son. No razor will touch his head, for the boy will be our Father's Nazirite from the womb, and will begin to save Israel from the Philistines' hand." నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆ బాలుని జుట్టు ఎప్పటికీ కత్తిరించకూడదు ఎందుకంటే పుట్టుక నుంచే అతడు నాజీరుగా, దేవునికి ప్రతిష్ఠ చేయబడతాడు. ఫిలిష్తీయుల చేతుల్లో నుండి అతడు ఇశ్రాయేలును రక్షించడం ప్రారంభిస్తాడు.”
6 The woman went and told her husband, "A man of God came to me; his appearance was like the appearance of the messenger of our Father, very awesome. I didn't ask him where he was from, and he didn't tell me his name." అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది: “ఓ దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు, అతడు దేవుని దూతలా చాలా భయం పుట్టించేవానిలా ఉన్నాడు. అతడు ఎక్కడ నుండి వచ్చాడో నేను అడగలేదు, అతడు నాకు తన పేరు చెప్పలేదు.
7 But he said to me, "You will conceive and bear a son. Now do not drink wine or strong drink, and eat nothing unclean, for the boy will be a Nazirite of our Father from the womb until the day of his death." అయితే అతడు నాతో, ‘నీవు గర్భవతివై కుమారుని కంటావు. నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకూడదు, అపవిత్రమైనదేది తినకూడదు ఎందుకంటే ఆ బాలుడు పుట్టుక నుండి చనిపోయే దినం వరకు దేవునికి నాజీరుగా ఉంటాడు.’ ”
8 Then Manoah pleaded with our Father: "Please, my Sovereign Father, let the man of God you sent come to us again and teach us what to do for the boy to be born." అప్పుడు మనోహ యెహోవాకు, “ప్రభువా, మీ దాసునిపై దయ చూపించండి. పుట్టబోయే బాలున్ని ఎలా పెంచాలో మాకు బోధించడానికి మీరు పంపిన దైవజనున్ని మళ్ళీ పంపమని వేడుకుంటున్నాను” అని ప్రార్ధించాడు.
9 Our Father heard Manoah's voice; the messenger of our Father came again to the woman sitting in the field, but Manoah her husband was not with her. దేవుడు మనోహ ప్రార్ధన విన్నారు. ఆ స్త్రీ పొలంలో ఉన్నప్పుడు ఆ దేవదూత మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చాడు; కాని అప్పుడు తన భర్త మనోహ ఆమెతో లేడు.
10 The woman ran quickly and told her husband, "Look, the man who came to me the other day has appeared to me!" ఆ స్త్రీ తన భర్త దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “ఆ రోజు నాకూ ప్రత్యక్షమైన వ్యక్తి మళ్ళీ కనిపించాడు” అని చెప్పింది.
11 Manoah got up, followed his wife, and came to the man. He asked, "Are you the man who spoke to the woman?" "I am," he said. మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి ఆ మనిషి, ఆ మనిషి దగ్గరకు వచ్చి, “నా భార్యతో మాట్లాడినది నీవేనా?” అని చెప్పాడు. “నేనే” అని అతడు అన్నాడు.
12 Manoah said, "When your words come true, what will govern the boy's life and work?" కాబట్టి మనోహ, “నీవు చెప్పింది జరిగాక ఆ బాలుడు ఎలా జీవించాలి, ఏమి చేయాలి?” అని అతన్ని అడిగాడు.
13 The messenger of our Father said to Manoah, "She must be careful of all I told her. యెహోవా దూత, “నేను నీ భార్యతో చెప్పినదంతా ఆమె చేయాలి.
14 She must eat nothing from the grapevine, drink no wine or strong drink, and eat nothing unclean. She must keep all I commanded her." ఆమె ద్రాక్షావల్లి నుండి వచ్చేది ఏదీ తినకూడదు, ద్రాక్షరసం మద్యం పుచ్చుకోకూడదు, అసలు అపవిత్రమైనదేది తినకూడదు. నేను ఆజ్ఞాపించిన ప్రతిదీ ఆమె చేయాలి” అన్నాడు.
15 Manoah said to our Father's messenger, "Please let us hold you, and we'll prepare a young goat for you." మనోహ యెహోవా దూతతో, “మేము నీకోసం మేకపిల్లను సిద్ధపరచే వరకు దయచేసి ఇక్కడ ఉండండి” అన్నాడు.
16 The messenger of our Father told Manoah, "Even if you hold me, I won't eat your food; but if you prepare a burnt offering, offer it to our Father." (Manoah didn't know the visitor was our Father's messenger.). అందుకు యెహోవా దూత, “మీరు ఆపినా సరే, నేను మీ ఆహారంలో ఏది తినను. అయితే మీరు దహనబలి సిద్ధపరిస్తే, అది యెహోవాకు అర్పించాలి” అన్నాడు (అతడు యెహోవా దూత అని మనోహ గ్రహించలేదు.)
17 Manoah asked the messenger of our Father, "What is your name, so we may honor you when your words come true?" అప్పుడు మనోహ యెహోవా దూతను, “నీవు చెప్పింది జరిగాక మేము నిన్ను గౌరవించాలి కాబట్టి నీ పేరేంటి?”
18 The messenger of our Father said to him, "Why ask my name? It's beyond understanding." యెహోవా దూత జవాబిస్తూ, “నా పేరెందుకు అడుగుతున్నావు, అది నీ గ్రహింపుకు మించింది” అన్నాడు.
19 So Manoah took the young goat and grain offering and offered them on the rock to our Father, who does wonders, while Manoah and his wife watched. మనోహ భోజనార్పణతో పాటు ఒక మేకపిల్లను తెచ్చి రాతి మీద యెహోవాకు అర్పించాడు. అప్పుడు మనోహ, అతని భార్య చూస్తూ ఉండగా యెహోవా దూత అద్భుతం చేశాడు.
20 As the altar's flame rose toward heaven, the messenger of our Father rose in the altar's flame. Manoah and his wife saw and fell facedown to the ground. ఆ బలిపీఠం నుండి మంటలు ఆకాశం వైపు లేస్తూవుంటే, ఆ మంటలతో పాటు యెహోవా దూత పైకి వెళ్లిపోయాడు. ఇది చూసి మనోహ, అతని భార్య నేల మీద సాష్టాంగపడ్డారు.
21 The messenger of our Father appeared no more to Manoah and his wife. Then Manoah knew he was the messenger of our Father. ఆ తర్వాత యెహోవా దూత మనోహకు, అతని భార్యకు మళ్ళీ ప్రత్యక్షం కాలేదు. అతడు యెహోవా దూత అని మనోహ గ్రహించాడు.
22 "We will surely die," Manoah said to his wife, "for we have seen our Father!" “మనం చచ్చిపోతాం! మనం దేవున్ని చూశాం!” అని మనోహ తన భార్యతో అన్నాడు.
23 His wife told him, "If our Father meant to kill us, he would not have accepted a burnt offering and grain offering from our hands, shown us all this, or let us hear this now." అయితే అతని భార్య, “యెహోవా మనలను చంపాలని అనుకుంటే, మన చేతులతో అర్పించిన దహనబలిని గాని భోజనార్పణను గాని ఆయన అంగీకరించేవారు కారు, వీటన్నిటిని మనకు చూపించేవారు కారు, ఇప్పుడిది మనకు చెప్పేవారు కారు” అని చెప్పింది.
24 The woman bore a son and named him Samson. The boy grew, and our Father blessed him. ఆ స్త్రీకి ఒక బాలుడు పుట్టగా అతనికి సంసోను అని పేరు పెట్టింది. అతడు పెద్దయ్యాక యెహోవా అతన్ని ఆశీర్వదించారు.
25 And the Spirit of our Father began to stir him in Mahaneh-dan, between Zorah and Eshtaol. అతడు జోరహు, ఎష్తాయోలు మధ్యలో మహెనుదాను అనే స్థలంలో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతన్ని పురికొల్పడం మొదలుపెట్టాడు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]