Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Jeremiah 46 OTSA

Show OTSA only
Verse × ×
1 This is the word of our Father that came to Jeremiah the prophet concerning the nations. ఇతర దేశాల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:
2 About Egypt: against Pharaoh Neco king of Egypt's army at Carchemish by the Euphrates, which Nebuchadnezzar king of Babylon defeated in Jehoiakim son of Josiah king of Judah's fourth year. ఈజిప్టును గురించి: యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో యూఫ్రటీసు నది దగ్గర కర్కెమీషులో ఓడిపోయిన ఈజిప్టు రాజైన ఫరో నెకో సైన్యానికి వ్యతిరేకంగా వచ్చిన సందేశం ఇది:
3 "Ready your shields—large and small—and advance for battle! “చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరండి.
4 Harness the horses; mount up, you riders! Take your stations with your helmets on; polish the spears, put on the armor!' గుర్రాలను సిద్ధం చేసుకోండి, గుర్రాలను ఎక్కండి! శిరస్త్రాణం ధరించి బయలుదేరడానికి సిద్ధపడండి! నీ ఈటెలను పదును చేయండి, మీ కవచాన్ని ధరించండి!
5 Why do I see it? They are terrified, falling back; their warriors are beaten down. They flee in headlong rout, never looking back—terror on every side! declares our Father. నేను చూస్తున్నదేంటి? వారు భయభ్రాంతులకు గురవుతున్నారు, వారు వెన్ను చూపుతున్నారు, వారి యోధులు ఓడిపోయారు. వారు వెనుకకు చూడకుండ వేగంగా పారిపోతున్నారు, అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
6 'The swift cannot flee, nor the warrior escape. In the north, beside the Euphrates River, they stumble and fall. “వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు, బలాఢ్యులు తప్పించుకోలేరు. ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన వారు తడబడి పడిపోతున్నారు.
7 Who is this, rising like the Nile, like rivers whose waters surge?" “నైలు నది ప్రవాహంలా ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు?
8 Egypt rises like the Nile, like rivers whose waters surge. She says, "I will rise, I will cover the earth; I will destroy cities and those who live in them." ఈజిప్టు నైలు నదిలా, ఉప్పెనలా ప్రవహిస్తుంది. ఆమె ఇలా అన్నది, ‘నేను లేచి భూమిని కప్పివేస్తాను, పట్టణాలను వాటిలోని ప్రజలను నాశనం చేస్తాను’ అంటుంది.
9 Charge, you horses! Drive furiously, you chariots! Let the warriors go out—Cush and Put who grip the shield, the Ludim who grip and bend the bow. గుర్రాల్లారా ఎగరండి, రథాల్లారా రెచ్చిపోండి! యోధులారా, డాళ్లు మోసే కూషు వారలారా, పూతు వారలారా, బయలుదేరండి, విల్లు విసిరే లిడియా పురుషులారా ముందుకు నడవండి.
10 That day belongs to the Father of heaven's armies, a day of justice, to bring justice against his foes. The sword will devour till it is gorged, drinking its fill of their blood; for the Father of heaven's armies holds a sacrifice in the land of the north, beside the Euphrates River. అయితే ఈ దినం సైన్యాల అధిపతియైన యెహోవాది; తన శత్రువుల మీద పగతీర్చుకునే దినం. ఖడ్గం తనకు తృప్తి కలిగే వరకు హతమారుస్తుంది, తన రక్త దాహం తీరే వరకు హతమారుస్తుంది. ఎందుకంటే యూఫ్రటీసు నది ప్రక్కన ఉత్తర దేశంలో సైన్యాల అధిపతియైన యెహోవా బలి అర్పించబోతున్నారు.
11 Go up to Gilead and get balm, virgin daughter of Egypt! You can pile up remedies, but there is no healing for you. “కన్యయైన ఈజిప్టు కుమారీ, గిలాదుకు వెళ్లి ఔషధతైలం తెచ్చుకో. కానీ నీవు అనేక మందులు వాడడం వ్యర్థమే; నీకు స్వస్థత కలుగదు.
12 The nations have heard of your shame, and the earth is full of your cry; for warrior stumbles against warrior, and the two fall together. దేశాలు నీ అవమానం గురించి వింటాయి; నీ కేకలు భూమంతటా వినబడతాయి. యోధులు ఒకరికొకరు తగిలి తడబడి; ఇద్దరూ కలిసి క్రిందకు పడిపోతారు.”
13 The word our Father spoke to Jeremiah the prophet about Nebuchadnezzar king of Babylon coming to strike Egypt's land: ఈజిప్టుపై దాడి చేయడానికి బబులోను రాజైన నెబుకద్నెజరు రావడం గురించి యెహోవా యిర్మీయా ప్రవక్తతో చెప్పిన సందేశం ఇది:
14 Declare it in Egypt, proclaim it in Migdol; proclaim it in Memphis and Tahpanhes. Say: "Take your stations and be ready, for the sword devours all around you." “ఈజిప్టులో ప్రకటన చేయండి, మిగ్దోలులో చాటించండి; మెంఫిసులో, తహ్పన్హేసులో కూడా చాటించండి: ‘ఖడ్గం నీ చుట్టూ ఉన్నవారందరిని హతమారుస్తుంది, కాబట్టి మీరు మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి.’
15 Why are your mighty ones swept away? They could not stand, because our Father thrust them down. నీ బలవంతులు ఎందుకు దిగజారిపోతారు? వారు నిలబడలేరు, ఎందుకంటే యెహోవా వారిని క్రిందికి నెట్టివేస్తారు.
16 He made many stumble; indeed, they fell over one another. They said, "Get up! Let us go back to our own people, to the land of our birth, away from the oppressing sword." వారు పదే పదే తడబడతారు; వారు ఒకరి మీద ఒకరు పడతారు. వారు, ‘లేవండి, మనం అణచివేసే వారి ఖడ్గానికి దూరంగా, మన స్వదేశాలకు, మన సొంత ప్రజల దగ్గరికి తిరిగి వెళ్దాం’ అని చెప్తారు.
17 There they cried: "Pharaoh king of Egypt is nothing but noise; he has let the appointed time slip by." అక్కడ వారు, ‘ఈజిప్టు రాజు ఫరో పెద్ద శబ్దం మాత్రమే; అతడు తన అవకాశాన్ని కోల్పోయాడు’ అని గట్టిగా కేకలు వేస్తారు.
18 As surely as I live, declares the King, whose name is the Father of heaven's armies, one will come like Tabor among the mountains, like Carmel by the sea. “నా జీవం తోడు” అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా, “పర్వతాల మధ్య తాబోరు లాంటివాడు, సముద్రం ఒడ్డున ఉన్న కర్మెలు లాంటివాడు వస్తాడు.
19 Pack your bags for exile, daughter of Egypt, sitting so secure! For Memphis will become a wasteland, a ruin where no one lives. ఈజిప్టులో నివసించేవారలారా, బందీలుగా వెళ్లడానికి మీ సామాన్లు సర్దుకోండి, ఎందుకంటే మెంఫిసు పాడుచేయబడి, నివాసులు లేక శిథిలమవుతుంది.
20 "Egypt is a beautiful heifer, but a stinging horsefly from the north is coming against her. “ఈజిప్టు అందమైన పాడి ఆవు, అయితే దాని మీదికి ఉత్తరం నుండి జోరీగ వస్తున్నది.
21 Even her hired soldiers in her midst are like fattened calves; they too turn and flee together, unable to stand, for the day of their disaster has come upon them, the time of their reckoning. దాని శాలల్లో ఉన్న కిరాయి సైనికులు బలిసిన దూడల వంటివారు. వారు కూడా నిలబడలేక, వెనక్కి పారిపోతారు. విపత్తు రోజు వారి మీదికి రాబోతోంది, అది వారు శిక్షించబడే సమయము.
22 Egypt hisses away like a fleeing serpent as the enemy advances in force; they come against her with axes, like woodcutters.' శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు పారిపోతున్న సర్పంలా ఈజిప్టు బుసలు కొడుతుంది. చెట్లు నరికేవారు గొడ్డళ్లతో వచ్చినట్లు వారు ఆమె మీదికి వస్తారు.
23 They will cut down her forest, declares our Father, dense though it is, for they are more numerous than locusts; they cannot be counted. ఆమె దట్టమైన అడవులను, వారు నరికివేస్తారు” అని యెహోవా చెప్తున్నారు. “వారి సంఖ్య మిడతల కంటే ఎక్కువ, వారిని లెక్కించలేము.
24 The daughter of Egypt will be put to shame, handed over to a people from the north." ఈజిప్టు కుమార్తె అవమానించబడుతుంది, ఉత్తరాది ప్రజల చేతికి అప్పగించబడుతుంది.”
25 "The Father of heaven's armies, our Father of Israel, says: 'I am punishing Amon god of Thebes, Pharaoh, Egypt, her gods and kings—Pharaoh and all who trust in him.' ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “తేబేసులోని ఆమోను దేవున్ని, ఫరోను, ఈజిప్టును దాని దేవుళ్ళను, రాజులను, ఫరోను నమ్ముకున్న వారిని శిక్షించబోతున్నాను.
26 I will hand them to those seeking their lives—to Nebuchadnezzar king of Babylon and his officers. Later Egypt will be inhabited as before, declares our Father. వారిని చంపాలనుకున్న వారి చేతులకు అనగా బబులోను రాజైన నెబుకద్నెజరుకు అతని అధికారులకు నేను వారిని అప్పగిస్తాను. ఆ తర్వాత ఈజిప్టు గతంలో ఉన్నట్లే నివాసయోగ్యంగా ఉంటుంది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
27 "But you, do not be afraid, Jacob my servant; do not be dismayed, Israel. For I am going to save you from far away, and your children from the land of their captivity. Jacob will return to quiet and ease, and no one will make him afraid. “నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలూ, కలవరపడకు. నేను నిన్ను సుదూర ప్రాంతం నుండి తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతివారిని బందీలుగా ఉన్న దేశం నుండి రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ శాంతి భద్రతలు కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.
28 Do not be afraid, Jacob my servant, declares your Father, for I am with you. Though I completely destroy all the nations to which I have driven you, I will not completely destroy you. I will discipline you with justice; I will not leave you entirely unpunished." నా సేవకుడైన యాకోబూ, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను” అని యెహోవా చెప్తున్నారు. “నేను నిన్ను చెదరగొట్టే దేశాలన్నిటిని పూర్తిగా నాశనం చేసినా, నిన్ను పూర్తిగా నాశనం చేయను. కాని నేను నిన్ను తగినంతగా శిక్షిస్తాను; శిక్షించకుండ మాత్రం నిన్ను వదిలిపెట్టను.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]