Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Isaiah 26 OTSA

Show OTSA only
Verse × ×
1 That day this song will be sung in Judah's land: We have a strong city; he sets salvation as walls and outworks. ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు: మనకు ఒక బలమైన పట్టణం ఉంది; దేవుడు రక్షణను దానికి గోడలుగా, ప్రాకారాలుగా ఉంచుతారు.
2 Open the gates, that the righteous nation may enter—the nation that keeps faith. నీతిగల దేశం నమ్మదగిన దేశం ప్రవేశించేలా గుమ్మాలు తీయండి.
3 You keep him in perfect peace whose mind is fixed on you, because he trusts in you. మీరు స్థిరమైన మనస్సుగల వారిని సంపూర్ణ సమాధానంతో కాపాడతారు, ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు.
4 Trust in our Father forever, for our Father is the everlasting Rock. యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి.
5 For he has brought low the inhabitants of the height, the lofty city. He lays it low, lays it low to the ground, casts it down to the dust. ఆయన ఎత్తైన స్ధలంలో నివసించేవారిని అణచివేస్తారు ఎత్తైన కోటలను పడగొడతారు; ఆయన దానిని నేల మట్టుకు పడగొట్టి దానిని ధూళిలో కలుపుతారు.
6 The foot tramples it down—the feet of the poor, the steps of the needy. అణచివేయబడినవారి కాళ్లతో పేదవారి అడుగులతో అది త్రొక్కబడుతుంది.
7 The path of the righteous is level; you make smooth the way of the righteous. నీతిమంతుల దారి సమంగా ఉంటుంది; యథార్థవంతుడా, మీరు నీతిమంతుల మార్గం సరాళం చేస్తావు.
8 In the path of your judgments, our Father, we wait for you; your name and your renown are the desire of our soul. అవును యెహోవా, మీ న్యాయవిధుల మార్గాల్లో నడుస్తూ మేము మీ కోసం వేచి ఉన్నాము; మీ నామం మీ కీర్తి మా హృదయాల కోరిక.
9 At night my soul longs for you; within me my spirit seeks you eagerly. For when your judgments reach the earth, those living in the world learn what is right. రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది; ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది. మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు, ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు.
10 If favor is shown to the wicked, he does not learn righteousness; in the land of uprightness he deals corruptly and does not see the majesty of our Father. కాని చెడ్డవారికి దయ చూపిస్తే, వారు నీతిని నేర్చుకోరు. యథార్థమైన దేశంలో ఉన్నా కూడా వారు చెడు చేస్తూనే ఉంటారు యెహోవా ఘనతను వారు పట్టించుకోరు.
11 Our Father, your hand is lifted up, but they do not see it. Let them see your zeal for your people and be ashamed. Let the fire reserved for your adversaries consume them. యెహోవా! మీ చేయి ఎత్తుగా ఎత్తబడింది, కాని వారు దానిని చూడరు. మీ ప్రజల పట్ల మీకున్న ఆసక్తి చూసి వారు సిగ్గుపడతారు; మీ శత్రువుల కోసం కేటాయించబడిన అగ్ని వారిని కాల్చివేయాలి.
12 Our Father, you will establish peace for us, for you have indeed accomplished all our works for us. యెహోవా! మీరు మాకు సమాధానాన్ని స్థాపిస్తారు; మేము సాధించిందంతా మీరు మాకోసం చేసిందే.
13 Our Father, other lords besides you have ruled over us, but your name alone we remember. యెహోవా! మా దేవా! మీరు కాకుండా వేరే ప్రభువులు మమ్మల్ని పాలించారు, కాని మేము మీ నామాన్ని మాత్రమే ఘనపరుస్తాము.
14 They are dead, they will not live; they are departed spirits, they will not rise; for you brought destruction on them and wiped out all remembrance of them. వారు చనిపోయారు, మరల బ్రతకరు; వారి ఆత్మలు లేవవు. మీరు వారిని శిక్షించి నాశనం చేశారు; మీరు వారి జ్ఞాపకాలన్నిటిని తుడిచివేశారు.
15 You have made the nation grow, our Father, you have made the nation grow; you are glorified; you have enlarged all the borders of the land. యెహోవా, మీరు దేశాన్ని వృద్ధిచేశారు; మీరు దేశాన్ని వృద్ధిచేశారు. మీరు మీకే మహిమ సంపాదించుకున్నారు; మీరు దేశపు సరిహద్దులన్నిటిని విస్తరింపజేశారు.
16 Our Father, in distress they sought you; they poured out a whispered prayer when your discipline was upon them. యెహోవా! వారు తమ బాధలో మీ దగ్గరకు వచ్చారు; మీరు వారిని శిక్షించినప్పుడు వారు దీన ప్రార్థనలు చేశారు.
17 Like a pregnant woman who writhes and cries out in her labor pains when she is about to give birth, so were we before you, our Father. గర్భిణి స్త్రీ ప్రసవానికి సిద్ధమైనప్పుడు ఆ నొప్పికి బాధతో కేకలు వేసినట్లు యెహోవా మీ సన్నిధిలో మేము ఉన్నాము.
18 We were pregnant, we writhed, but we gave birth only to wind. We have brought no deliverance to the earth, and the inhabitants of the world have not been born. మేము గర్భం ధరించి ప్రసవవేదన పడ్డాము. కాని గాలికి జన్మనిచ్చాము. మేము భూమికి రక్షణను తీసుకురాలేదు, ఈ లోక ప్రజలు పుట్టలేదు.
19 Your dead will live; their bodies will rise. Awake and sing for joy, you who dwell in the dust! For your dew is the dew of dawn light, and the earth will give birth to the departed spirits. కాని యెహోవా, చనిపోయిన మీ వారు బ్రతుకుతారు; వారి శరీరాలు పైకి లేస్తాయి మట్టిలో నివసిస్తున్నవారు, మేల్కొని సంతోషించాలి. మీ మంచు ఉదయపు మంచు వంటిది; భూమి తన మృతులకు జన్మనిస్తుంది.
20 Come, my people, enter your rooms and shut your doors behind you; hide yourselves for a little while until the wrath has passed by. నా ప్రజలారా! మీ గదిలోకి వెళ్లి మీ వెనక తలుపులు వేసుకోండి; ఆయన ఉగ్రత పోయే వరకు కొంతకాలం మీరు దాక్కోండి.
21 For look, our Father is coming out from his place to punish the people of the earth for their sins, and the earth will disclose the blood shed upon it and will no longer cover those slain in it. ఇదిగో వారి పాపాలను బట్టి భూప్రజలను శిక్షించడానికి యెహోవా తన నివాసంలో నుండి వస్తున్నారు. భూమి తనపై చిందిన రక్తాన్ని వెల్లడిస్తుంది; భూమి చంపబడిన వారిని ఇకపై దాచదు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]