Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Ezra 8 OTSA

Show OTSA only
Verse × ×
1 These are the heads of their families, and the genealogy of those who came up with me from Babylon during King Artaxerxes' reign: రాజైన అర్తహషస్త పాలనలో నాతో కూడా బబులోను నుండి వచ్చిన కుటుంబ పెద్దలు వారితో పాటు నమోదైన వారి వివరాలు:
2 From Phinehas's sons, Gershom; from Ithamar's sons, Daniel; from David's sons, Hattush. ఫీనెహాసు వారసుల నుండి: గెర్షోము; ఈతామారు వారసుల నుండి: దానియేలు; దావీదు వారసుల నుండి: హట్టూషు
3 Of Shecaniah's sons; of Parosh's sons: Zechariah, with 150 males traced by genealogy. షెకన్యా వారసుల నుండి వచ్చినవాడు; పరోషు వారసుల నుండి: జెకర్యా, అతనితో పాటు నమోదైన 150 మంది పురుషులు;
4 Of the sons of Pahath-moab, Eliehoenai the son of Zerahiah, and with him 200 males. పహత్-మోయాబు వారసుల నుండి: జెరహ్యా కుమారుడైన ఎల్యోయేనై, అతనితో పాటు నమోదైన 200 మంది పురుషులు;
5 Of the sons of Zattu, Shecaniah the son of Jahaziel, and with him 300 males. జట్టు వారసుల నుండి: షెకన్యా కుమారుడైన యహజీయేలు, అతనితో పాటు నమోదైన 300 మంది పురుషులు;
6 Of the sons of Adin, Ebed the son of Jonathan, and with him 50 males. ఆదీను వారసుల నుండి: యోనాతాను కుమారుడైన ఎబెదు, అతనితో పాటు నమోదైన 50 మంది పురుషులు;
7 Of the sons of Elam, Jeshaiah the son of Athaliah, and with him 70 males. ఏలాము వారసుల నుండి: అతల్యా కుమారుడైన యెషయా, అతనితో పాటు నమోదైన 70 మంది పురుషులు;
8 Of the sons of Shephatiah, Zebadiah the son of Michael, and with him 80 males. షెఫట్యా వారసుల నుండి: మిఖాయేలు కుమారుడైన జెబద్యా, అతనితో పాటు నమోదైన 80 మంది పురుషులు;
9 Of the sons of Joab, Obadiah the son of Jehiel, and with him 218 males. యోవాబు వారసుల నుండి: యెహీయేలు కుమారుడైన ఓబద్యా, అతనితో పాటు నమోదైన 218 మంది పురుషులు;
10 Of the sons of Bani, Shelomith the son of Josiphiah, and with him 160 males. బానీ వారసుల నుండి: షెలోమీతు కుమారుడైన యోసిప్యా, అతనితో పాటు నమోదైన 160 మంది పురుషులు;
11 Of the sons of Bebai, Zechariah the son of Bebai, and with him 28 males. బేబై వారసుల నుండి: బేబై కుమారుడైన జెకర్యా, అతనితో పాటు నమోదైన 28 మంది పురుషులు;
12 Of the sons of Azgad, Johanan the son of Hakkatan, and with him 110 males. అజ్గాదు వారసుల నుండి: హక్కాటాను కుమారుడైన యోహానాను, అతనితో పాటు నమోదైన 110 మంది పురుషులు;
13 Adonikam's sons, the later ones—names: Eliphelet, Jeuel, Shemaiah—and 60 males with them. అదోనీకాము వారసుల నుండి: చివరి వారైన ఎలీఫెలెతు, యెహీయేలు, షెమయా, వారితో పాటు నమోదైన 60 మంది పురుషులు;
14 Of the sons of Bigvai, Uthai and Zaccur, and with them 70 males. బిగ్వయి వారసుల నుండి: ఊతై, జక్కూరు, వారితో పాటు నమోదైన 70 మంది పురుషులు.
15 I gathered them at the river flowing toward Ahava, and we camped there three days. Checking the people and priests, I found no sons of Levi there. అహవా వైపు ప్రవహించే ఓ కాలువ దగ్గర నేను వీరందరిని సమావేశపరిచాను. అక్కడ మేము మూడు రోజులు బస చేశాము. అక్కడ ఉన్న ప్రజలను యాజకులను పరిశీలించి నేను గ్రహించింది ఏంటంటే వారిలో లేవీయులెవ్వరూ లేరు.
16 Then I sent for leaders Eliezer, Ariel, Shemaiah, Elnathan, Jarib, Elnathan, Nathan, Zechariah, and Meshullam, and for discerning men Joiarib and Elnathan. కాబట్టి నేను నాయకులైన ఎలీయెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము అనే వారిని, అలాగే వివేచన కలిగిన యోయారీబు ఎల్నాతానులను పిలిపించి,
17 I sent them to Iddo, the leader at Casiphia, and told them what to say to him and his kin, the temple servants there, so they'd bring us ministers for our Father's house. కాసిప్యా ప్రాంతంలో నాయకుడైన ఇద్దో దగ్గరకు వెళ్లమని ఆదేశించాను. వారు మా దేవుని మందిర సేవకులను మా దగ్గరకు తీసుకువచ్చేలా ఇద్దో అతని తోటి లేవీయులైన ఆలయ సేవకులకు ఏమి చెప్పాలో వారికి చెప్పాను.
18 By our Father's good hand on us, they brought us a discerning man from the sons of Mahli son of Levi son of Israel: Sherebiah, with his sons and brothers, eighteen. మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందుకు, వారు ఇశ్రాయేలు కుమారుడైన లేవీకి పుట్టిన మహలి వారసుడు, సమర్థుడైన షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని తీసుకువచ్చారు;
19 Hashabiah, and with him Jeshaiah from Merari's sons, with his brothers and their sons—twenty in all, హషబ్యాను, అతనితో మెరారి వారసుడైన యెషయాను, అతని సోదరులను, వారి కుమారులను మొత్తం 20 మందిని తీసుకువచ్చారు.
20 and 220 temple servants, whom David and the officials assigned to serve the Levites—all listed by name. వారితో పాటు లేవీయులకు సహాయంగా దావీదు అతని అధికారులు నిర్ణయించిన ఆలయ సేవకులలో నుండి 220 మందిని తీసుకువచ్చారు. వారందరి పేర్లు నమోదు చేయబడి ఉన్నాయి.
21 So there, at the river Ahava, I proclaimed a fast, to humble ourselves before our Father and seek from him a safe path for us, our children, and all our goods. అప్పుడు అక్కడ అహవా కాలువ దగ్గర, మనమందరం ఉపవాసం ఉండి, మన దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుని మనకు మన పిల్లలకు మన ఆస్తి అంతటికి క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వమని వేడుకుందామని నేను ప్రకటించాను.
22 I was ashamed to ask the king for soldiers and horsemen to protect us from the enemy on the road, since we had told him, "The hand of our Father is on all who seek him for good, but his power and anger are against all who abandon him." మేము రాజుతో, “మా దేవున్ని వెదికే ప్రతి ఒక్కరిపై ఆయన కరుణాహస్తం ఉంటుంది. ఆయనను విడిచిపెట్టినవారి మీద ఆయన తీవ్రమైన కోపం కుమ్మరించబడుతుంది” అని చెప్పాము కాబట్టి, దారిలో ఎదురయ్యే శత్రువులు నుండి కాపాడడానికి సైనికులు, గుర్రపురౌతులను మాకు సహాయంగా పంపమని రాజును అడగడానికి నేను సిగ్గుపడ్డాను.
23 So we fasted and pleaded with our Father about this, and he listened to our prayer. కాబట్టి మేము ఉపవాసముండి, దీని గురించి మా దేవునికి మొరపెట్టగా, ఆయన మా ప్రార్థనకు జవాబిచ్చారు.
24 I set apart twelve leading priests—Sherebiah, Hashabiah—and ten of their brothers with them. నేను యాజకులలో నుండి ముఖ్యమైన పన్నెండుమందిని అనగా, షేరేబ్యా, హషబ్యా, వారి సోదరులలో పదిమందిని ఎంపిక చేశాను.
25 I weighed out to them the silver, gold, and vessels—the offering for our Father's house that the king, his counselors, his officials, and all Israel there had offered. రాజు అతని సలహాదారులు అధికారులు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరు మన దేవుని మందిరానికి విరాళంగా ఇచ్చిన వెండి బంగారాన్ని వస్తువులను తూచి నేను వారికి ఇచ్చాను.
26 I weighed into their hands about 24 tons silver, silver vessels worth about 4 tons, gold about 4 tons, నేను 650 తలాంతుల వెండి, 100 తలాంతుల వెండి పాత్రలు, 100 తలాంతుల బంగారం
27 20 gold basins worth 1,000 darics, and two vessels of fine, gleaming bronze, as precious as gold. 1,000 డారిక్కుల బరువుగల 20 బంగారు గిన్నెలు, మేలిమి బంగారమంతా విలువైన రెండు మెరిసే ఇత్తడి పాత్రలు తూచి ఇచ్చాను.
28 I said to them, "You are holy to our Father, and the vessels are holy, and the silver and gold are a voluntary offering to our Father, the God of your fathers. నేను వారితో, “మీరు, ఈ వస్తువులతో పాటు యెహోవాకు ప్రతిష్ఠించబడ్డారు, ఈ వెండి బంగారాలు మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు ఇష్టపూర్వకంగా ఇచ్చిన అర్పణ.
29 Watch and guard them until you weigh them before the chief priests, the Levites, and the family heads of Israel at Jerusalem, in the chambers of our Father's house." యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదుల్లో ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల కుటుంబ పెద్దల సమక్షంలో వీటిని తూచి అప్పగించే వరకు వీటిని జాగ్రత్తగా కాపాడండి” అని చెప్పాను.
30 The priests and Levites took the weighed silver, gold, and vessels, to bring to Jerusalem, to the house of our Father. అప్పుడు యాజకులు, లేవీయులు, యెరూషలేములోని దేవుని ఆలయానికి తీసుకుని వెళ్లడానికి తూచిన వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తీసుకున్నారు.
31 We set out from the river Ahava on the twelfth day of the first month for Jerusalem. The hand of our Father was on us, rescuing us from the enemy and from ambush along the way. అహవా కాలువ దగ్గర నుండి మొదటి నెల పన్నెండవ రోజున మేము యెరూషలేముకు రావాలని బయలుదేరాము. మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి, శత్రువుల నుండి, దారిలో పొంచి ఉండే బందిపోట్లు నుండి ఆయన మమ్మల్ని కాపాడారు.
32 We came to Jerusalem and rested there three days. కాబట్టి మేము యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే బస చేశాము.
33 On day four, silver, gold, and vessels were weighed in our Father's house and handed to Meremoth, priest son of Uriah, with Eleazar son of Phinehas beside him, and Levites Jozabad son of Jeshua and Noadiah son of Binnui beside them. నాలుగవ రోజున మా దేవుని మందిరంలో, వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తూకం వేసి, యాజకుడును ఊరియా కుమారుడునైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో పాటు ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు, లేవీయులైన యెషూవ కుమారుడైన యోజాబాదు, బిన్నూయి కుమారుడైన నోవద్యా ఉన్నారు.
34 Everything was counted and weighed, and the full weight was recorded at that time. ఆ సమయంలో ప్రతిదాన్ని సంఖ్య ప్రకారం, బరువు ప్రకారం లెక్కించారు, వాటి మొత్తం బరువును నమోదు చేశారు.
35 Then the returned exiles offered burnt offerings to our Father, God of Israel: twelve bulls for all Israel, ninety-six rams, seventy-seven lambs, twelve male goats as a sin offering—all of it a burnt offering to our Father. తర్వాత చెర నుండి విడుదలై తిరిగివచ్చిన ప్రవాసులు ఇశ్రాయేలీయుల దేవునికి దహనబలిగా ఇశ్రాయేలీయులందరి కోసం పన్నెండు ఎడ్లు, తొంభై ఆరు పొట్టేళ్లు, డెబ్బై ఏడు గొర్రెపిల్లలను పాపపరిహారబలిగా పన్నెండు మేకపోతులను అర్పించారు. ఇదంతా యెహోవాకు అర్పించిన దహనబలి.
36 They also delivered the king's decrees to the king's satraps and to the governors of the province Beyond the River, and these supported the people and the house of our Father. వారు రాజు ఆదేశాలను రాజు అధికారులకు, యూఫ్రటీసు నది అవతలనున్న అధిపతులకు అప్పగించిన తర్వాత, వారందరు ప్రజలకు, దేవుని మందిర పనికి సహాయపడ్డారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]