Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Ezra 10 OTSA

Show OTSA only
Verse × ×
1 As Ezra prayed, confessed, wept, and fell before the house of our Father, a huge assembly of Israel—men, women, children—gathered to him, and the people wept bitterly. ఎజ్రా దేవుని మందిరం ఎదుట నేలమీద పడి ఏడుస్తూ పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులలో స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు పెద్ద సమూహంగా అతని చుట్టూ చేరి వారు కూడా బిగ్గరగా ఏడ్చారు.
2 Then Shecaniah son of Jehiel, one of Elam's descendants, said to Ezra, "We have broken faith with our Father and married foreign women from the peoples of the land. Yet there's still hope for Israel despite this. అప్పుడు ఏలాము వారసులలో ఒకడైన యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో, “మా చుట్టూ ఉన్న ప్రజల నుండి పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని మన దేవుని పట్ల నమ్మకద్రోహం చేశాము. అయినా ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకుంటారనే నిరీక్షణ ఉంది.
3 So now, let's covenant with our Father to send away all these wives and their children, as advised by my lord and those who tremble at our Father's command; let it be done by the Law. నా ప్రభువు సలహా ప్రకారం మన దేవుని ఆజ్ఞలకు భయపడేవారి సలహా ప్రకారం, ఈ స్త్రీలను వారి పిల్లలందరిని పంపించి వేయడానికి మన దేవుని ఎదుట ఒక నిబంధన చేద్దాము. ధర్మశాస్త్రం ప్రకారం ఇది జరగాలి.
4 Get up, for this matter rests on you, and we are with you. Be strong and act." లెండి; ఈ పని మీ చేతిలోనే ఉంది. మేము మీకు మద్ధతు ఇస్తాం కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి” అన్నాడు.
5 Ezra then stood and had the chief priests, Levites, and all Israel swear to do as agreed. They took the oath. అప్పుడు ఎజ్రా లేచి, ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులందరు ఆ మాట ప్రకారం చేసేలా వారితో ప్రమాణం చేయించాడు. వారు ప్రమాణం చేశారు.
6 Then Ezra rose from before the house of our Father and went to the room of Jehohanan son of Eliashib, staying the night without bread or water, for he mourned over the unfaithfulness of the exiles. అప్పుడు ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి బయలుదేరి ఎల్యాషీబు కుమారుడైన యెహోహనాను గదిలోకి వెళ్లాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు, ఎజ్రా అన్నపానాలు పుచ్చుకోలేదు ఎందుకంటే, చెరగొనిపోబడిన వారి నమ్మకద్రోహాన్ని బట్టి దుఃఖించాడు.
7 Then they sent word through Judah and Jerusalem for all the returned exiles to gather at Jerusalem. చెర నుండి విడుదలై వచ్చిన వారంతా యెరూషలేములో సమావేశం కావాలని యూదాలో, యెరూషలేములో ప్రకటన చేశారు.
8 Whoever failed to come within three days, by decision of the officials and elders, forfeited all his property and was excluded from the assembly of the exiles. ఎవరైనా మూడు రోజుల లోపు అధికారులు, పెద్దల నిర్ణయం ప్రకారం రాకపోతే, వారి ఆస్తి జప్తు చేయబడుతుంది. వారు చెర నుండి విడుదలై వచ్చిన వారి సమాజంలో నుండి వెలివేయబడతారు.
9 All the men of Judah and Benjamin gathered in Jerusalem within three days—on the twentieth day of the ninth month. All the people sat in the square before the house of our Father, trembling over this matter and the heavy rains. మూడు రోజుల్లో, యూదా, బెన్యామీను పురుషులందరు యెరూషలేములో సమకూడారు. తొమ్మిదవ నెల ఇరవయ్యవ రోజున ప్రజలందరు దేవుని మందిరం ఎదురుగా ఉన్న కూడలిలో కూర్చుని భారీ వర్షంలో తడుస్తూ ఈ విషయాన్ని బట్టి ఎంతో దిగులుతో ఉన్నారు.
10 Ezra the priest rose and said to them, "You have been unfaithful, marrying foreign women, adding to Israel's guilt. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి నిలబడి వారితో, “మీరు నమ్మకద్రోహులుగా ఉన్నారు; పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని ఇశ్రాయేలీయుల దోషాన్ని ఇంకా ఎక్కువ చేశారు.
11 Now confess to our Father, the God of your fathers, and do his will. Separate from the peoples of the land and from the foreign women." ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించండి, ఆయన చిత్తం చేయండి. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రజల నుండి, మీ పరాయి దేశపు భార్యల నుండి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి” అని చెప్పాడు.
12 Then the whole assembly answered with a loud voice, "Yes! We must do as you have said. అప్పుడు అక్కడ చేరి ఉన్నవారందరు స్పందిస్తూ బిగ్గరగా ఇలా అన్నారు: “నీవు చెప్పింది సరియైనది! నీవు చెప్పినట్లు మేము చేయాలి.
13 But the people are many, and it's the rainy season, so we can't stand outside. This isn't a job of one or two days, for we've sinned greatly in this matter. అయితే ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, ఇప్పుడు చాలా పెద్ద వర్షం కురుస్తుండడం వలన మేము బయట నిలబడలేము. అంతేకాక, ఇది ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే విషయం కాదు ఎందుకంటే, ఈ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేశాము.
14 Let our leaders act for the whole assembly. Let all in our towns who married foreign women come at set times, with each town's elders and judges, until our Father's burning anger over this matter turns from us." కాబట్టి ఈ సమాజమంతటి పక్షంగా మా అధికారులు నిలబడాలి. అప్పుడు ఈ విషయంలో మన దేవుని తీవ్రమైన కోపం మన నుండి తొలగిపోయే వరకు మన పట్టణాల్లో పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న ప్రతివారు నిర్ణయించిన సమయంలో ప్రతి పట్టణపు పెద్దలతో, న్యాయాధిపతులతో రావాలి.”
15 Only Jonathan son of Asahel and Jahzeiah son of Tikvah opposed this; Meshullam and Shabbethai the Levite supported them. దీనిని కేవలం అశాహేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహజ్యాలు మెషుల్లాము, లేవీయుడైన షబ్బెతై అనేవారి మద్దతుతో దీన్ని వ్యతిరేకించారు.
16 So the exiles did this. Ezra the priest chose men, heads of fathers' houses, each named, for their father's house. On the first day of the tenth month they sat to examine the matter, కాబట్టి నిర్ణయించిన ప్రకారం చెర నుండి విడుదలైన వారు చేశారు. అప్పుడు యాజకుడైన ఎజ్రా, కుటుంబ పెద్దలైన వారిని ప్రతి కుటుంబం నుండి ఒకరు చొప్పున, వారి వారి పేర్లను బట్టి ఎన్నుకున్నాడు. ఈ విషయం పరిశీలించటానికి పదవనెల మొదటి రోజున వారంతా కూర్చున్నారు.
17 by day one of the first month, they finished with all the men who had married foreign women. మొదటి నెల మొదటి రోజుకి పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న వారందరి విషయాన్ని పరిష్కరించడం జరిగింది.
18 Among the priests' sons found to have married foreign women: sons of Jeshua son of Jozadak and his brothers—Maaseiah, Eliezer, Jarib, and Gedaliah. యాజకుల వారసులలో పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న వారు వీరు: యోజాదాకు కుమారుడైన యెషూవ వారసులు, అతని సహోదరుల నుండి: మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా.
19 They pledged to send away their wives; guilty, they offered a ram from the flock for their guilt. (వీరంతా తమ భార్యలను పంపివేస్తామని మాట ఇచ్చారు. తమ దోషాన్ని బట్టి అపరాధపరిహారబలిగా ఒక్కొక్కరు మందలో ఒక్కొక్క పొట్టేలు అర్పించారు.)
20 Of the sons of Immer: Hanani and Zebadiah. ఇమ్మేరు వారసుల నుండి: హనానీ, జెబద్యా.
21 Of the sons of Harim: Maaseiah, Elijah, Shemaiah, Jehiel, and Uzziah. హారీము వారసుల నుండి: మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.
22 Of the sons of Pashhur: Elioenai, Maaseiah, Ishmael, Nethanel, Jozabad, and Elasah. పషూరు వారసుల నుండి: ఎల్యోయేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.
23 Of the Levites: Jozabad, Shimei, Kelaiah (that is, Kelita), Pethahiah, Judah, and Eliezer. లేవీయుల నుండి: యోజాబాదు, షిమీ, కెలిథా అనే కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.
24 Of the singers: Eliashib. Of the gatekeepers: Shallum, Telem, and Uri. సంగీతకారుల నుండి: ఎల్యాషీబు. ద్వారపాలకుల నుండి: షల్లూము, తెలెము, ఊరి.
25 And of Israel: of the sons of Parosh—Ramiah, Izziah, Malchijah, Mijamin, Eleazar, Malchijah, and Benaiah. ఇతర ఇశ్రాయేలీయుల నుండి: పరోషు వారసుల నుండి: రమ్యా, ఇజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియాజరు, మల్కీయా, బెనాయా.
26 Of the sons of Elam: Mattaniah, Zechariah, Jehiel, Abdi, Jeremoth, and Elijah. ఏలాము వారసుల నుండి: మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా.
27 Of the sons of Zattu: Elioenai, Eliashib, Mattaniah, Jeremoth, Zabad, and Aziza. జత్తూ వారసుల నుండి: ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.
28 Of the sons of Bebai: Jehohanan, Hananiah, Zabbai, and Athlai. బేబై వారసుల నుండి: యెహోహనాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.
29 Of the sons of Bani: Meshullam, Malluch, Adaiah, Jashub, Sheal, and Jeremoth. బానీ వారసుల నుండి: మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు షెయాలు, యెరేమోతు.
30 Of the sons of Pahath-moab: Adna, Chelal, Benaiah, Maaseiah, Mattaniah, Bezalel, Binnui, and Manasseh. పహత్-మోయాబు వారసుల నుండి: అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే.
31 Of the sons of Harim: Eliezer, Isshijah, Malchijah, Shemaiah, Shimeon, హారీము వారసుల నుండి: ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా, షిమ్యోను,
32 Benjamin, Malluch, and Shemariah. బెన్యామీను, మల్లూకు, షెమర్యా.
33 Of the sons of Hashum: Mattenai, Mattattah, Zabad, Eliphelet, Jeremai, Manasseh, and Shimei. హాషుము వారసుల నుండి: మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీఫెలెతు, యెరేమై, మనష్షే, షిమీ.
34 Of the sons of Bani: Maadai, Amram, Uel, బానీ వారసుల నుండి: మయదై, అమ్రాము, ఊయేలు,
35 Benaiah, Bedeiah, Cheluhi, బెనాయా, బేద్యా, కెలూహు,
36 Vaniah, Meremoth, Eliashib, వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు
37 Mattaniah, Mattenai, and Jaasu. మత్తన్యా, మత్తెనై, యయశావు.
38 Of the sons of Binnui: Shimei, బానీ బిన్నూయి వారసుల నుండి: షిమీ,
39 Shelemiah, Nathan, Adaiah, షెలెమ్యా, నాతాను, అదాయా,
40 Machnadebai, Shashai, Sharai, మక్నద్బయి, షాషై, షారాయి,
41 Azarel, Shelemiah, Shemariah, అజరేలు, షెలెమ్యా, షెమర్యా,
42 Shallum, Amariah, and Joseph. షల్లూము, అమర్యా, యోసేపు.
43 Of the sons of Nebo: Jeiel, Mattithiah, Zabad, Zebina, Jaddai, Joel, and Benaiah. నెబో వారసుల నుండి: యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా.
44 All these had married foreign women, and some of them had wives by whom they had children. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. వారిలో కొందరికి ఈ భార్యల వలన పిల్లలు కూడా పుట్టారు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]