Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

Deuteronomy 31 OTSA

Show OTSA only
Verse × ×
1 Then Moses went and spoke these words to all Israel. మోషే బయటకు వెళ్లి ఇశ్రాయేలీయులతో ఈ మాటలు చెప్పాడు:
2 He said to them, "Today I am 120 years old; I can no longer go out and come in, and our Father has told me, 'You will not cross this Jordan.' “నాకు ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు, నేను ఇకపై మిమ్మల్ని నడిపించలేను. ‘నీవు యొర్దాను దాటవు’ అని యెహోవా నాకు చెప్పారు.
3 Your Father himself will cross over ahead of you; he will destroy these nations before you, and you will drive them out. Joshua will cross over ahead of you, as our Father has said. మీ దేవుడైన యెహోవా స్వయంగా మీకు ముందుగా దాటి వెళ్లి మీ ముందు ఉండకుండ ఈ దేశాలను నాశనం చేస్తారు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టుగా, యెహోషువ కూడా మీకు ముందుగా దాటివెళ్తాడు.
4 Our Father will do to them as he did to Sihon and Og, kings of the Amorites, and their land, when he destroyed them. అమోరీయుల రాజులైన సీహోను, ఓగులను వారి దేశంతో పాటు నాశనం చేసినట్టుగా, యెహోవా వారికి చేస్తారు.
5 Our Father will give them to you, and you must do to them exactly as I commanded you. యెహోవా వారిని మీకు అప్పగిస్తారు, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు వారికి చేయాలి.
6 Be strong and courageous. Don't fear or dread them, for your Father goes with you; he will never leave you nor forsake you." నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. వారికి మీరు భయపడవద్దు దిగులుపడవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో వెళ్తారు; ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలేయరు, మీ చేయి విడువరు.”
7 Moses summoned Joshua and told him before all Israel, "Be strong and courageous—you will go with this people into the land our Father swore to their ancestors to give them, and you will hand it to them as their inheritance. తర్వాత మోషే యెహోషువను పిలిపించి, ఇశ్రాయేలీయులందరి సమక్షంలో అతనితో ఇలా అన్నాడు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఈ ప్రజలకు ఇస్తానని వారి పూర్వికులకు యెహోవా ప్రమాణం చేసిన దేశంలోకి నీవు ఈ ప్రజలతో పాటు వెళ్లి దానిని వారికి వారసత్వంగా ఇవ్వాలి.
8 Our Father himself goes before you; he will be with you. He will never leave you nor forsake you. Don't fear; don't be discouraged." యెహోవాయే స్వయంగా మీ ముందు వెళ్తారు మీతో ఉంటారు; ఆయన నిన్ను ఎన్నడూ వదిలేయరు, నిన్ను చేయి విడువరు. భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు.”
9 Moses wrote this law and gave it to the priests, sons of Levi, who carried the ark of our Father's covenant, and to all Israel's elders. కాబట్టి మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాసి, లేవీయులైన యాజకులకు అంటే యెహోవా నిబంధన మందసాన్ని మోసేవారికి, ఇశ్రాయేలీయుల పెద్దలందరికి ఇచ్చాడు.
10 Then Moses commanded them: "At the end of every seven years, at the set time of the release year, during the Festival of Booths, తర్వాత మోషే, “ప్రతి ఏడు సంవత్సరాల చివరిలో, అప్పులు రద్దు చేసే సంవత్సరంలో, గుడారాల పండుగ సమయంలో,
11 when all Israel comes before your Father in the place he chooses, read this law aloud to all Israel. ఇశ్రాయేలీయులందరు మీ దేవుడైన యెహోవా ఎదుట ఆయన ఎంచుకున్న స్థలంలో కనబడినప్పుడు, మీరు వారందరికి ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలి.
12 Assemble the people—men, women, children, and the foreigner living in your towns—to hear, learn, and fear your Father, and keep and do all the words of this law. మీ పట్టణాల్లో నివసిస్తున్న పురుషులు, స్త్రీలు, పిల్లలు, విదేశీయులను సమకూర్చండి. అప్పుడు వారు విని మీ దేవుడైన యెహోవాకు భయపడటం, ఈ ధర్మశాస్త్రంలోని అన్ని మాటలను జాగ్రత్తగా పాటించడం నేర్చుకుంటారు.
13 Then their children, who don't know this law, will hear it and learn to fear your Father all the days you live in the land you are crossing the Jordan to possess." ఈ ధర్మశాస్త్రం తెలియని వారి పిల్లలు తప్పక విని, మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటి వెళ్లబోయే దేశంలో మీరు నివసించినంత కాలం మీ దేవుడైన యెహోవాకు భయపడటం నేర్చుకోవాలి.”
14 Our Father told Moses, "Your death is near. Call Joshua and present yourselves at the tent of meeting; I will commission him." So Moses and Joshua went and presented themselves at the tent of meeting. ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు చనిపోయే రోజు దగ్గరలో ఉంది. యెహోషువను పిలిచి, సమావేశ గుడారం దగ్గరకు రండి, అక్కడ నేను అతన్ని నియమిస్తాను” అని చెప్పారు. కాబట్టి మోషే, యెహోషువ వచ్చి సమావేశ గుడారం దగ్గర ఉన్నారు.
15 Then our Father appeared in the tent in a pillar of cloud, and the pillar of cloud stood at the tent's entrance. అప్పుడు యెహోవా గుడారం దగ్గర మేఘస్తంభంలో ప్రత్యక్షమయ్యారు, మేఘం గుడార ద్వారం మీద నిలిచింది.
16 And our Father said to Moses, "You are about to lie down with your ancestors. This people will then rise and prostitute themselves after the foreign gods of the land they are entering, forsaking me and breaking the covenant I made with them. యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు నీ పూర్వికులతో విశ్రాంతి తీసుకోబోతున్నావు, ఈ ప్రజలు త్వరలో తాము ప్రవేశించే దేశంలోని పరదేశి దేవతలకు వేశ్యగా మారతారు. వారు నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసుకున్న నిబంధనను ఉల్లంఘిస్తారు.
17 On that day my anger will burn against them. I will abandon them, hide my face from them, and they will be devoured. Many disasters and troubles will come on them. On that day they will say, 'Haven't these disasters come on us because our God isn't with us?' ఆ రోజున నేను వారిపై కోప్పడి వారి చేయి విడిచిపెడతాను; నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను, వారు నాశనమవుతారు. అనేక విపత్తులు, ఆపదలు వారి పైకి వస్తాయి, ఆ రోజు వారు, ‘ఈ విపత్తులు మనపైకి రావడానికి కారణం మన దేవుడు మనతో లేకపోవడం కాదా?’ అని అనుకుంటారు.
18 I will surely hide my face that day, for all the evil they've done, turning to other gods. వారు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి చేసిన దుష్టత్వాన్ని బట్టి నేను ఆ రోజు ఖచ్చితంగా నా ముఖాన్ని దాచుకుంటాను.
19 Now write this song for yourselves, teach it to the Israelites, put it in their mouths, so this song may witness for me against the Israelites. “ఇప్పుడు ఈ పాటను వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించి వారితో పాడించండి, అది వారికి వ్యతిరేకంగా నాకు సాక్ష్యంగా ఉంటుంది.
20 When I bring them into the land flowing with milk and honey, sworn to their ancestors, they will eat, grow full and fat, turn to other gods and serve them, despise me, and break my covenant. నేను వారి పూర్వికులకు ప్రమాణం చేసిన ప్రకారం వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకువచ్చినప్పుడు, వారు తృప్తిగా తిని లావెక్కినప్పుడు, వారు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని సేవించి, నన్ను తిరస్కరిస్తూ, నా నిబంధనను ఉల్లంఘిస్తారు.
21 When many disasters and troubles overtake them, this song will confront them as a witness, for it won't be forgotten from their descendants' mouths. For I know what they're forming today, before I bring them into the land I swore to give them." వారి మీదికి అనేక విపత్తులు, ఆపదలు వచ్చి పడతాయి. ఈ అనుభవాలకు సాక్ష్యంగా ఈ పాట పాడుకుంటారు. దీన్ని వారి సంతతివారు ఎన్నడూ మరచిపోరు. ప్రమాణం చేసిన వాగ్దాన దేశంలో నేను ఇంకా వారిని తీసుకురాకముందే, ఈ రోజే వారేం ఆలోచన చేస్తున్నారో నాకు తెలుసు.”
22 So Moses wrote down this song that same day and taught it to the Israelites. కాబట్టి మోషే ఆ రోజు ఈ పాటను వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించాడు.
23 Then our Father commissioned Joshua son of Nun: "Be strong and courageous—you will bring the Israelites into the land I swore to give them, and I myself will be with you." యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈ ఆజ్ఞ ఇచ్చారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశంలోకి నీవు వారిని తీసుకువస్తావు, నేను నీతో ఉంటాను.”
24 When Moses had finished writing the words of this law in a book, from beginning to end, మోషే ఈ ధర్మశాస్త్రం యొక్క మాటలన్నీ మొదటి నుండి చివరి వరకు ఒక గ్రంథంలో వ్రాయడం పూర్తి చేశాక,
25 he commanded the Levites who carried the ark of the covenant of our Father: యెహోవా నిబంధన మందసాన్ని మోసే లేవీయులకు మోషే ఇలా ఆజ్ఞాపించాడు:
26 "Take this Book of the Law and put it beside the ark of the covenant of your Father, to remain there as a witness against you. “ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచండి. అది మీమీద సాక్షిగా ఉంటుంది.
27 For I know your rebellion and stubbornness. Even now, while I'm alive with you today, you've rebelled against our Father—how much more after my death! ఎందుకంటే మీ తిరుగుబాటుతనం, మొండితనం నాకు తెలుసు. నేను ఇంకా మీతో బ్రతికి ఉన్నప్పుడే మీరు యెహోవాపై తిరుగుబాటు చేస్తే, నేను చనిపోయిన తర్వాత మీరు ఇంకెంత ఎక్కువ తిరుగుబాటు చేస్తారు కదా!
28 Gather to me all your tribal elders and officers, so I may speak these words to them and call heaven and earth to witness against them. గోత్ర పెద్దలందరినీ, మీ అధికారులందరినీ సమావేశపరచండి. ఆకాశాన్ని భూమిని వారి మీద సాక్షులుగా ఉంచి వారు వింటుండగా నేను మాట్లాడతాను.
29 For I know that after my death you will become utterly corrupt and turn aside from the way I have commanded you. And in the days to come disaster will fall upon you, because you will do what is evil in the sight of our Father, provoking him to anger through the work of your hands." ఎందుకంటే నేను చనిపోయాక మీరు పూర్తిగా అవినీతిపరులై నేను ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు తొలగిపోతారని నాకు తెలుసు. రాబోయే రోజుల్లో, మీరు యెహోవా దృష్టికి చెడు చేసి, మీ చేతులు చేసిన వాటి వల్ల ఆయనకు కోపం పుట్టిస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో విపత్తు మీ మీదికి వస్తుంది.”
30 Moses recited the words of this song, start to finish, to Israel's whole assembly. ఇశ్రాయేలు సమాజమంతా వింటుండగా మోషే ఈ పాటలోని పదాలను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చదివాడు:
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]