Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

2 Samuel 22 OTSA

Show OTSA only
Verse × ×
1 David spoke to our Father the words of this song when our Father rescued him from the hand of all his enemies and from the hand of Saul. యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి, సౌలు చేతి నుండి విడిపించినప్పుడు దావీదు యెహోవా సన్నిధిలో ఈ పాట పాడాడు.
2 He said: My Father is my rock, my fortress, my rescuer. అతడు ఇలా పాడాడు: “యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు;
3 My Father, my rock, in whom I take refuge, my shield and the power of my salvation, my stronghold and my refuge, my savior—you save me from violence. నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు, నా రక్షణ కొమ్ము. ఆయన నా బలమైన కోట, నా ఆశ్రయం, నా రక్షకుడు హింసించేవారి నుండి నన్ను రక్షిస్తారు.
4 I call upon my Father, who is worthy of praise, and I am saved from my enemies. “స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.
5 For the waves of death engulfed me; the torrents of destruction terrified me. మరణపు అలలు నన్ను చుట్టుకున్నాయి; దుష్టులు వరదల్లా నన్ను ముంచెత్తుతారు.
6 The cords of the grave entangled me; the snares of death confronted me. సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి.
7 In my distress I called upon my Father; I cried out to my God for help. From his temple he heard my voice, and my cry reached his ears. “నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన చెవులకు చేరింది.
8 Then the earth shook and quaked; the foundations of the heavens trembled and shook, because he was angry. అప్పుడు భూమి కంపించి అదిరింది, పరలోకపు పునాదులు కదిలాయి. ఆయన కోపానికి అవి వణికాయి.
9 Smoke rose from his nostrils, and consuming fire came from his mouth; burning coals blazed from him. ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, దానిలో నిప్పులు మండుతున్నాయి.
10 He parted the heavens and came down, with dark clouds beneath his feet. ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు; ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.
11 He mounted a cherub and flew; he soared on the wings of the wind. ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు. ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.
12 He made darkness his canopy around him—the dark rain clouds of the skies. ఆయన చీకటిని తన చుట్టూ పందిరిగా, కారు మేఘాలను పందిరిగా చేసుకున్నారు.
13 Out of the brightness before him blazed coals of fire. ఆయన సన్నిధి కాంతి నుండి పిడుగులు వచ్చాయి.
14 My Father thundered from heaven; the Most High raised his voice. యెహోవా పరలోకం నుండి ఉరిమారు. మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.
15 He shot his arrows and scattered his foes, hurled lightning and routed them. ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు, మెరుస్తున్న గొప్ప పిడుగులతో వారిని తరిమికొట్టారు.
16 The channels of the sea appeared, the foundations of the world were laid bare at the rebuke of my Father, at the blast of breath from his nostrils. యెహోవా గద్దింపుకు, ఆయన నాసికా రంధ్రాల్లో నుండి వచ్చే బలమైన ఊపిరికి సముద్రపు అగాధాలు కనబడ్డాయి, భూమి పునాదులు బయటపడ్డాయి.
17 He reached down from on high and took hold of me; he drew me out of deep waters. “ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.
18 He rescued me from my powerful enemy, from my foes who were too strong for me. శక్తివంతమైన నా శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు.
19 They confronted me in the day of my disaster, but my Father was my support. నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు.
20 He brought me out into a spacious place; he rescued me because he delighted in me. ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.
21 My Father dealt with me according to my righteousness; according to the purity of my hands he rewarded me. “నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు; నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చారు.
22 For I have kept the ways of my Father; I have not wickedly turned from my God. నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు.
23 All his judgments are before me; I have not turned aside from his statutes. ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి; ఆయన శాసనాల నుండి నేను తొలగిపోలేదు.
24 I was blameless before him, and I kept myself free from my guilt. ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, నేను పాపానికి దూరంగా ఉన్నాను.
25 So my Father rewarded me according to my righteousness, according to my purity in his sight. నా నీతిని బట్టి ఆయన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చారు.
26 To the faithful you show yourself faithful; to the blameless you show yourself blameless. “నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు, యథార్థంగా ఉండే వారికి మిమ్మల్ని మీరు యథార్థవంతులుగా కనుపరచుకుంటారు,
27 To the pure you show yourself pure, but to the crooked you show yourself shrewd. నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు, కాని వంచకులకు మిమ్మల్ని మీరు వివేకిగా కనుపరచుకుంటారు.
28 You save the afflicted people, but your eyes are on the haughty, to bring them low. మీరు దీనులను రక్షిస్తారు, అహంకారులపై మీ దృష్టి ఉంచి వారిని అణచివేస్తారు.
29 For you are my lamp, my Father; he turns my darkness into light. యెహోవా! మీరు నాకు దీపము; యెహోవా నా చీకటిని వెలుగుగా మారుస్తారు.
30 With you I can charge an army; with my Father I can leap over a wall. మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను; నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను.
31 As for my Father, his way is perfect; the word of my Father is flawless. He is a shield to all who take refuge in him. “దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది; యెహోవా వాక్కు లోపం లేనిది; ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు.
32 For who is God but our Father? And who is a rock except our Father? యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు?
33 My Father is my strong refuge; he makes my way blameless. బలంతో నన్ను సాయుధునిగా చేసేది, నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే.
34 He makes my feet like the feet of a deer and sets me secure on the heights. నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు; ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు.
35 He trains my hands for battle, so that my arms can bend a bow of bronze. నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు; నా చేతులు ఇత్తడి విల్లును వంచగలవు.
36 You have given me the shield of your salvation, and your gentleness has made me great. మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు, మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది.
37 You widen the path beneath me, so that my ankles do not give way. నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు.
38 I pursued my enemies and destroyed them; I did not turn back until they were finished. “నేను నా శత్రువులను వెంటాడి వారిని నాశనం చేశాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు.
39 I consumed them and shattered them so they could not rise; they fell beneath my feet. వారు మళ్ళీ లేవకుండా వారిని పూర్తిగా నలుగగొట్టాను; వారు నా పాదాల క్రింద పడ్డారు.
40 You armed me with strength for battle; you made my adversaries bow beneath me. మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు; మీరు నా విరోధులను నా ముందు అణచివేశారు.
41 You made my enemies turn their backs in flight, and those who hated me I destroyed. మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు, నేను నా విరోధులను నాశనం చేశాను.
42 They looked, but there was no one to save them—even to my Father, but he gave no answer. వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు.
43 I ground them as fine as the dust of the earth; I crushed and trampled them like mud in the streets. భూమి మీద ఉండే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను; వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను.
44 You delivered me from the strife of my people; you kept me as head of nations; a people I did not know now serves me. “జనాల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు; జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు. నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.
45 Foreigners cower before me; as soon as they hear, they obey me. విదేశీయులు నా ముందు భయపడుతున్నారు; నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు.
46 Foreigners lose heart; they come trembling from their strongholds. వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు.
47 My Father lives! Blessed be my Rock! Exalted be my Father, the Rock of my salvation! “యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి! నా రక్షణ ఆశ్రయమైన దేవునికి మహిమ!
48 It is my Father who gives me justice and brings peoples down beneath me. నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే, దేశాలను నాకు లోబరచేది ఆయనే.
49 He brings me out from my enemies. You lifted me high above my foes; you rescued me from the violent man. నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే. నా విరోధులకు పైగా మీరు నన్ను హెచ్చించారు; హింసాత్మక వ్యక్తుల నుండి మీరు నన్ను విడిపించారు.
50 Therefore I will praise you among the nations, my Father; I will sing praises to your name. అందుకే యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామ సంకీర్తన చేస్తాను.
51 He gives great victories to his king and shows covenant love to his anointed, to David and his descendants forever. “ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, తన మారని దయను చూపిస్తారు.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]