Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

2 Kings 7 OTSA

Show OTSA only
Verse × ×
1 Elisha said, "Hear the word of our Father. This is what our Father says: By this time tomorrow, seven quarts of fine flour will sell for four ounces of silver, and fourteen quarts of barley for four ounces of silver, at the gate of Samaria." అందుకు ఎలీషా రాజుతో, “యెహోవా మాట విను. యెహోవా చెప్పే మాట ఇదే: రేపు ఇదే వేళకు షెకెల్ వెండికి ఒక మానిక సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల యవలు సమరయ ద్వారం దగ్గర అమ్ముతారు” అని చెప్పాడు.
2 Then the officer on whose arm the king leaned answered the man of our Father, "Look, even if our Father opened windows in the heavens, could this happen?" Elisha replied, "You will see it with your own eyes, but you will not eat any of it." రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకుని ఉన్నాడో ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరచినా కూడా, ఇది జరగుతుందా?” అని అన్నాడు. అందుకు ఎలీషా, “నీవు నీ సొంత కళ్లతో చూస్తావు కాని, దానిలో ఏమీ తినవు” అన్నాడు.
3 Four men with a skin disease were at the gate entrance, and said to each other, "Why sit here until we die? అప్పుడు పట్టణ ప్రవేశ ద్వారం దగ్గర నలుగురు కుష్ఠురోగులు ఉన్నారు, వారు ఒకరితో ఒకరు, “మనం చచ్చేంతవరకు ఎందుకు ఇక్కడ ఉండాలి?
4 If we say, 'Let's enter the city,' the famine is there, and we die. If we stay here, we die too. So come, let's go over to the Aramean camp. If they spare us, we live; if they kill us, we die." ఒకవేళ మనం పట్టణంలోనికి వెళ్తే అక్కడ కరువుతో చస్తాము. ఇలా ఇక్కడే ఉన్నా మనం చస్తాము. కాబట్టి మనం అరామీయుల శిబిరానికి వెళ్లి వారి దగ్గర లొంగిపోదాము. వారు మనలను బ్రతకనిస్తే బ్రతుకుతాం చంపితే చస్తాం” అనుకున్నారు.
5 So at twilight they rose to go to the Aramean camp. Reaching its edge, they found no one there. సంధ్యా సమయంలో వారు లేచి అరామీయుల శిబిరానికి వెళ్లారు. వారు ఆ శిబిరం పొలిమేరకు వెళ్లగా అక్కడ ఎవరూ లేరు.
6 For the Sovereign Father had made the Aramean army hear the sound of chariots and horses, the sound of a great army, so they said to one another, "Look, the king of Israel has hired the kings of the Hittites and of Egypt to attack us!" ఎందుకంటే యెహోవా అరాము సైన్యానికి రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం వస్తున్న శబ్దం వినిపించేటట్టు చేశారు, అందువల్ల వారు ఒకరితో ఒకరు, “చూడండి, ఇశ్రాయేలు రాజు మనమీద దాడి చేయడానికి హిత్తీయుల రాజులను, ఈజిప్టు రాజులను తోడు తెచ్చుకున్నాడు!” అని చెప్పుకున్నారు.
7 So they got up and fled at twilight, leaving their tents, horses, and donkeys. They left the camp as it was and fled for their lives. కాబట్టి వారు తమ ప్రాణాలు దక్కించుకోవాలని తమ గుడారాలను, గుర్రాలను, గాడిదలను ఎక్కడివి అక్కడే శిబిరంలో వదిలిపెట్టి తెల్లవారక ముందే చీకట్లోనే పారిపోయారు.
8 When these men with the skin disease reached the camp's edge, they entered one tent, ate and drank, then carried off silver, gold, and clothing and hid them. They returned, entered another tent, took things from it, and hid those too. ఆ కుష్ఠురోగులు శిబిరం దగ్గరకు వచ్చి ఒక గుడారంలోకి వెళ్లి అందులో తిని త్రాగారు. తర్వాత వారు వెండి, బంగారం, దుస్తులను తీసుకెళ్లి దాచారు. వారు తిరిగివచ్చి ఇంకొక గుడారంలోకి వెళ్లి, అందులో నుండి వస్తువులు తీసుకెళ్లి వాటిని దాచిపెట్టారు.
9 They said to each other, "We're not doing right. This is a day of good news, and we're keeping it to ourselves. If we wait until morning light, punishment will find us. Now come, let's go at once and tell the king's household." అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మనం చేసేది మంచిది కాదు. ఇది శుభవార్త కలిగిన రోజు, మనం ఎవరితో పంచుకోవడం లేదు! ఒకవేళ తెల్లవారే వరకు మనం ఆగితే, శిక్షకు గురవుతాము. కాబట్టి ఇప్పుడే వెళ్లి రాజభవనంలో ఈ విషయం తెలియజేద్దాం” అని చెప్పుకొన్నారు.
10 So they came and called to the city gatekeepers, reporting: "We went to the Aramean camp—no one there, no human sound, only horses and donkeys tied up, and the tents just as they were." కాబట్టి వారు వెళ్లి పట్టణ ద్వారపాలకులను పిలిచి, “మేము అరామీయుల శిబిరానికి వెళ్లాము. అక్కడ ఎవరూ లేరు, మనిషి చప్పుడు కూడా లేదు, గుర్రాలు, గాడిదలు, గుడారాలు ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి” అని చెప్పారు.
11 The gatekeepers called out the news, and it was reported inside the king's household. ఆ ద్వారపాలకులు, ఆ వార్త బిగ్గరగా కేకలువేస్తూ రాజభవనంలో ఉన్నవారికి తెలియజేశారు.
12 That night the king rose and told his officials, "Let me tell you the Arameans' plan against us. They know we're starving, so they've left camp to hide in the fields, thinking: When they leave the city, we'll take them alive and get inside." రాజు రాత్రివేళ లేచి తన అధికారులతో, “మనకు వ్యతిరేకంగా అరామీయులు చేసేది చెప్తాను వినండి, మనం ఆకలితో అలమటిస్తున్నామని వారికి తెలుసు; కాబట్టి ‘వారు ఖచ్చితంగా బయటకు వస్తారు, అప్పుడు వారిని ప్రాణాలతో పట్టుకుని, నగరంలో చొరబడదాం’ అని అనుకుని వారు శిబిరం విడిచిపెట్టి వెళ్లి పొలాల్లో దాక్కున్నారు” అని చెప్పాడు.
13 One of his servants said, "Have some men take five of the horses left in the city. They will fare like all the Israelites left here—like all the Israelites already dead. Let us send them and see." అతని అధికారులలో ఒకడు, “పట్టణంలో మిగిలిన అయిదు గుర్రాలను తీసుకుని కొంతమందిని అక్కడికి వెళ్లనివ్వండి, వారి పరిస్థితి, మిగిలిన ఇశ్రాయేలీయులందరి పరిస్థితి ఒక్కటే, అందరం చనిపోతాము. కాబట్టి ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వారిని పంపుదాం” అని అన్నాడు.
14 So they took two chariots with horses, and the king sent them after the Aramean army, saying, "Go, find out." కాబట్టి వారు రెండు రథాలను, వాటి గుర్రాలను తీసుకున్నారు. రాజు వారిని అరాము సైన్యం వెనుక పంపుతూ, “మీరు వెళ్లి ఏమి జరిగిందో తెలుసుకోండి” అని వారిని ఆదేశించాడు.
15 They followed them to the Jordan; the whole road was littered with clothes and gear the Arameans threw off in their haste. The messengers returned and told the king. వారు అరాము సైన్యం వెంట యొర్దాను వరకు వెళ్లారు, దారి పొడవున అరామీయులు పారిపోయే తొందరలో బట్టలు సామాన్లు పారవేసి వెళ్లారు. కాబట్టి రాజు పంపిన దూతలు తిరిగివచ్చి ఆ విషయం రాజుకు తెలిపారు.
16 The people went out and plundered the Aramean camp. So seven quarts of fine flour sold for four ounces of silver, and fourteen quarts of barley for four ounces of silver, as our Father had said. అప్పుడు ప్రజలు బయటకు వెళ్లి అరామీయుల శిబిరాన్ని దోచుకున్నారు. యెహోవా చెప్పిన మాట ప్రకారమే, షెకెల్ వెండికి ఒక మానిక సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల యవలు అమ్మబడింది.
17 The king had put the captain on whose arm he leaned in charge of the gate; the crowd trampled him there, and he died—just as the man of our Father had said when the king came down to him. రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకున్నాడో, ఆ అధిపతిని ముఖ్య ద్వారపాలకునిగా నియమించాడు, ద్వారం దగ్గర ప్రజలు అతన్ని త్రొక్కగా అతడు చనిపోయాడు. రాజు తన ఇంటికి దగ్గరకు వచ్చినప్పుడు దైవజనుడు చెప్పినట్టే ఇది జరిగింది.
18 It happened just as the man of our Father told the king: "About this time tomorrow at Samaria's gate, fourteen quarts of barley will sell for four ounces of silver, and seven quarts of fine flour for four ounces of silver." దైవజనుడు రాజుతో, “రేపు ఇదే సమయానికి సమరయ పట్టణ ద్వారం దగ్గర ఒక షెకెల్ వెండికి మానిక సన్నని గోధుమ పిండి, ఒక షెకెల్ వెండికి రెండు మానికల యవలు అమ్ముతారు” అని చెప్పాడు.
19 The officer had answered the man of our Father, "Look, even if our Father opened windows in the heavens, could such a thing happen?" And he replied, "You will see it with your own eyes, but you will not eat any of it." అంతకుముందు, ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరిచినా కూడా, ఇది జరుగుతుందా?” అని అన్నాడు. దైవజనుడు జవాబిస్తూ, “నీవు నీ కళ్లారా చూస్తావు కాని దానిలో ఏమి తినవు” అన్నాడు.
20 This is exactly what happened: the people trampled him in the gateway, and he died. ఆ అధిపతికి అదే జరిగింది, ఎందుకంటే ప్రజలు ద్వారం దగ్గర అతన్ని త్రొక్కివేశారు, అతడు చనిపోయాడు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]