Skip to content
The Believer's Library

Biblica® Open Telugu Contemporary Version

2 Kings 4 OTSA

Show OTSA only
Verse × ×
1 The wife of one of the sons of the prophets cried out to Elisha, "Your servant my husband is dead, and you know that your servant revered our Father. Now the creditor comes to take my two children as slaves." ఒక రోజు ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, “మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, అతడు యెహోవా పట్ల భక్తి కలవాడని మీకు తెలుసు. అయితే ఇప్పుడు అతనికి అప్పిచ్చినవాడు నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు” అని మొరపెట్టింది.
2 Elisha asked, "What can I do for you? Tell me, what's in your house?" She said, "Your servant has nothing but a jar of oil." ఎలీషా, “నేను నీకెలా సహాయం చేయాలి? నీ ఇంట్లో ఏముందో చెప్పు” అన్నాడు. “నీ సేవకురాలి దగ్గర ఒక చిన్న పాత్రలో కొంచెం ఒలీవనూనె తప్ప ఇంకేమి లేదు” అని ఆమె చెప్పింది.
3 Then he said, "Go, borrow vessels outside from all your neighbors—empty vessels, not a few. అప్పుడు ఎలీషా, “నీవు వెళ్లి, నీ పొరుగు వారందరి దగ్గర ఖాళీ పాత్రలను అడుగు. ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకో.
4 Go in, shut the door behind you and your sons, and pour oil into all these jars. As each is filled, set it aside." అప్పుడు నీవు, నీ కుమారులు ఇంట్లోకి వెళ్లి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండినవాటిని ప్రక్కన పెట్టండి” అని చెప్పాడు.
5 So she left him, shut the door behind her and her sons; they kept bringing the vessels, she kept pouring. ఆమె అతని దగ్గర నుండి వెళ్లి, తన కుమారులతో లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. వారు ఆమె దగ్గరకు తెచ్చిన పాత్రలన్నిట్లో ఆమె నూనె పోస్తూ ఉంది.
6 When the jars were full, she told her son, "Bring me another." "There are none left," he said. Then the oil stopped. పాత్రలన్నీ నిండినప్పుడు ఆమె తన కుమారునితో, “ఇంకొకటి తీసుకురా” అన్నది. అతడు, “ఇంకొక పాత్ర లేదు” అని జవాబిచ్చాడు. అప్పుడు నూనె ప్రవాహం ఆగిపోయింది.
7 She came and told the man of our Father, who said, "Go, sell the oil, pay your debt, and you and your sons live on the rest." ఆమె వెళ్లి దైవజనునికి చెప్పగా అతడు, “వెళ్లు, ఆ నూనె అమ్మి, నీ అప్పు తీర్చుకో. మిగిలిన దానితో నీవు, నీ కుమారులు జీవనం కొనసాగించండి” అన్నాడు.
8 One day Elisha passed through Shunem, where a wealthy woman lived; she urged him to stay and eat. Whenever he passed by, he stopped there to eat. ఒక రోజు ఎలీషా షూనేముకు వెళ్లాడు. అక్కడ ఒక ధనికురాలు ఉండేది, ఆమె భోజనానికి రావాలని అతన్ని ప్రాధేయపడింది. కాబట్టి అతడు ఆ దారిన వెళ్లేటప్పుడు అక్కడ భోజనం చేయడానికి ఆగేవాడు.
9 She told her husband, "Look, I know this man who often passes by us is a holy man of our Father. ఆమె తన భర్తతో, “మన దారిలో వస్తూ వెళ్తూ ఉండే ఈ మనిషి పరిశుద్ధుడైన దైవజనుడని నాకు తెలుసు.
10 Let's make him a small roof room with a bed, table, chair, and lamp, so he can stay whenever he comes." మనం పైకప్పు మీద చిన్న గది కట్టి అందులో పడక, బల్ల, కుర్చీ, దీపం ఉంచుదాము. మన దగ్గరకు అతడు వచ్చినప్పుడెల్లా, అతడు ఆ గదిలో ఉండవచ్చు” అని చెప్పింది.
11 One day Elisha came there, turned into the upper room, and lay down. ఒక రోజు ఎలీషా అక్కడికి వచ్చి ఆ మేడ గదిలో పడుకున్నాడు.
12 He told his servant Gehazi, "Call this Shunammite woman." He called her, and she stood before him. తర్వాత అతడు తన సేవకుడైన గేహజీతో, “షూనేమీయురాలిని పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగానే ఆమె వచ్చి అతని ముందు నిలబడింది.
13 Elisha said to him, "Tell her: You've gone to all this trouble for us. What can be done for you? Should I speak for you to the king or the army commander?" She answered, "I live among my own people." ఎలీషా అతనితో, “ఆమెతో చెప్పు, ‘మాకోసం ఈ శ్రమంతా తీసుకున్నారు, ఇప్పుడు మీ కోసం ఏం చెయ్యాలో చెప్పండి. మేము మీ తరపున రాజుతో గాని సైన్యాధిపతితో గాని మాట్లాడాలా?’ ” అని అన్నాడు. అందుకామె, “నేను నా స్వజనుల మధ్య నివసిస్తున్నాను” అన్నది.
14 He asked, "What can be done for her?" Gehazi said, "She has no son, and her husband is old." ఎలీషా, “మరి ఆమె కోసం ఏం చేస్తే బాగుంటుంది?” అని అడిగాడు. గేహజీ, “ఆమెకు కుమారుడు లేడు, ఆమె భర్త వృద్ధుడు” అని జవాబిచ్చాడు.
15 He said, "Call her." So he called her, and she stood in the doorway. అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగా ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.
16 He said, "At this season next year, you will embrace a son." She said, "No, my lord, man of our Father, don't lie to your servant." అప్పుడు ఎలీషా, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు” అని చెప్పాడు. అందుకామె, “వద్దు, నా ప్రభువా! దయచేసి, దైవజనుడా, మీ సేవకురాలితో అబద్ధం చెప్పకండి!” అని అన్నది.
17 The woman conceived and bore a son at that season the next year, as Elisha had told her. తర్వాత ఆమె గర్భవతియై మరుసటి సంవత్సరం ఎలీషా చెప్పినట్లే కుమారుని కన్నది.
18 The child grew, and one day he went out to his father, to the reapers. ఆ బాలుడు పెరిగిన తర్వాత ఒక రోజు కోత కోసేవారి దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరకు వెళ్లాడు.
19 He told his father, "My head! My head!" His father told a servant, "Carry him to his mother." అకస్మాత్తుగా అతడు తన తండ్రితో, “నా తల! నా తల!” అన్నాడు. అతని తండ్రి తన సేవకులలో ఒకనితో, “బాలున్ని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లు” అని చెప్పాడు.
20 He carried him to his mother; the boy sat on her knees until noon, then died. సేవకుడు బాలున్ని ఎత్తుకుని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లాడు, బాలుడు ఆమె ఒడిలో మధ్యాహ్నం వరకు కూర్చుని ఆ తర్వాత చనిపోయాడు.
21 She went up, laid him on the man of our Father's bed, shut the door behind him, and left. ఆమె బాలున్ని తీసుకెళ్లి దైవజనుడైన ఎలీషా మంచం మీద పడుకోబెట్టి తలుపు మూసి బయటకు వెళ్లింది.
22 She called her husband: "Send me a servant and a donkey, so I can run to the man of our Father and come back." ఆమె తన భర్తను పిలిచి, “దయచేసి నా కోసం ఒక పనివాన్ని ఒక గాడిదను పంపించండి, నేను తొందరగా దైవజనుని దగ్గరకు వెళ్లి రావాలి” అని అన్నది.
23 He asked, "Why go to him today? It's not new moon or Sabbath." She said, "It's fine." అందుకతడు, “అతని దగ్గరకు ఈ రోజు ఎందుకు వెళ్తావు? ఇది అమావాస్య కాదు సబ్బాతు దినం కాదు కదా” అన్నాడు. అందుకామె, “అంతా సమాధానంగానే ఉంటుంది” అన్నది.
24 She saddled the donkey and told her servant, "Drive on; don't slow down for me unless I tell you." ఆమె గాడిద మీద జీను వేసుకుని పనివానితో, “త్వరగా నడిపించు; నేను చెప్పే వరకు నెమ్మదిగా వెళ్లకు” అని చెప్పింది.
25 She set out and came to the man of our Father at Mount Carmel. Seeing her in the distance, the man of our Father told Gehazi his servant, "Look, the Shunammite woman. కాబట్టి ఆమె బయలుదేరి కర్మెలు పర్వతం మీద ఉన్న దైవజనుని దగ్గరకు వచ్చింది. ఆమెను దూరం నుండి చూసి, ఆ దైవజనుడు తన సేవకుడైన గేహజీతో, “చూడు! అదిగో షూనేమీయురాలు!
26 Run now, meet her, and ask, 'Are you well? Is your husband well? Is the child well?'" She answered, "All is well." ఆమెను కలుసుకోడానికి పరిగెత్తి వెళ్లి, ‘మీరు క్షేమమా? మీ భర్త క్షేమమా! మీ బాలుడు క్షేమమా?’ అని అడుగు” అన్నాడు. ఆమె, “అంతా క్షేమమే” అన్నది.
27 When she reached the man of our Father on the mountain, she grabbed his feet. Gehazi came to push her away, but he said, "Leave her alone—her soul is in bitter distress, and our Father has hidden it from me, not told me." ఆమె పర్వతం మీద ఉన్న దైవజనుని చేరుకొని, అతని పాదాలు పట్టుకుంది. గేహజీ ఆమెను అవతలకు నెట్టాలని దగ్గరకు వచ్చాడు, కాని దైవజనుడు, “ఆమెను వదిలేయి! ఆమె వేదనతో ఉన్నది కాని యెహోవా ఈ విషయం నాకు చెప్పకుండా మరుగు చేశారు” అని అన్నాడు.
28 She said, "Did I ask my lord for a son? Didn't I say, 'Don't raise my hopes'?" ఆమె, “నా ప్రభువా, మిమ్మల్ని కుమారుడు కావాలని అడిగానా? నాతో అబద్ధం చెప్పకండి అని నేను అనలేదా?” అని అన్నది.
29 Elisha told Gehazi, "Tuck your cloak in your belt, take my staff in your hand, and go. If you meet anyone, don't greet him; if anyone greets you, don't answer him. Lay my staff on the boy's face." ఎలీషా గేహజీతో, “నీ నడికట్టు బిగించుకుని, నా దండం చేతపట్టుకుని పరుగెత్తు. నీకు ఎవరైనా ఎదురైతే పలకరించవద్దు, ఎవరైనా పలకరిస్తే, జవాబివ్వకు. నా దండం బాలుని ముఖం మీద పెట్టు” అని చెప్పాడు.
30 But the child's mother said, "As our Father lives and you live, I won't leave you." So he got up and followed her. అయితే ఆ బాలుని తల్లి, “సజీవుడైన యెహోవా మీద, మీమీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను మిమ్మల్ని విడిచిపెట్టను” అన్నది. కాబట్టి అతడు లేచి ఆమె వెంట వెళ్లాడు.
31 Gehazi went ahead of them, laid the staff on the boy's face, but there was no sound or response. He went back to meet Elisha: "The boy has not awakened." గేహజీ వారికంటే ముందే వెళ్లి బాలుని ముఖం మీద ఆ దండం ఉంచాడు, అయితే ఏ శబ్దం కాని స్పందన కాని లేదు. కాబట్టి గేహజీ ఎలీషాను కలుసుకోడానికి వెళ్లి అతనితో, “బాలుడు మేలుకోలేదు” అని చెప్పాడు.
32 When Elisha came into the house, there was the child, dead, lying on his bed. ఎలీషా ఇంటికి వెళ్లి తన మంచం మీద చనిపోయి ఉన్న బాలుని చూశాడు.
33 So he went in, shut the door behind the two of them, and prayed to our Father. అతడు గదిలోకి వెళ్లి వారిద్దరే లోపల ఉండగా తలుపు మూసి యెహోవాకు ప్రార్థన చేశాడు.
34 Then he climbed up and lay on the child—mouth on mouth, eyes on eyes, hands on hands. As he stretched over him, the child's body grew warm. తర్వాత మంచం ఎక్కి, బాలుని నోటి మీద తన నోరు, కళ్ల మీద తన కళ్లు, చేతుల మీద చేతులు ఉంచి బాలుని మీద పడుకున్నాడు. అతడు వాడి మీద బోర్లా పడుకున్నప్పుడు బాలుని శరీరంలో వేడి పుట్టింది.
35 He got up, paced the room once, then climbed up and stretched over the boy again. The boy sneezed seven times and opened his eyes. ఎలీషా మంచం దిగి గదిలో ఒకసారి అటూ ఇటూ నడిచి మరలా మంచం ఎక్కి బాలుని మీద బోర్లా పడుకున్నప్పుడు బాలుడు ఏడుసార్లు తుమ్మి కళ్లు తెరిచాడు.
36 Elisha called Gehazi: "Call this Shunammite woman." He called her; she came to him, and he said, "Take your son." ఎలీషా గేహజీని పిలిపించి, “షూనేమీయురాలిని పిలువు” అన్నాడు, అతడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చినప్పుడు అతడు, “నీ కుమారుని తీసుకో” అన్నాడు.
37 She came, fell at his feet, bowed to the ground, then picked up her son and left. ఆమె లోపలికి వచ్చి, అతని కాళ్ల దగ్గర పడి నమస్కరించింది. తర్వాత ఆమె తన కుమారుని తీసుకుని బయటకు వెళ్లింది.
38 Elisha returned to Gilgal during a famine. As the prophets' sons sat before him, he told his servant, "Put the large pot on; boil stew for the prophets' sons." తర్వాత ఎలీషా గిల్గాలుకు తిరిగి వెళ్లాడు, అప్పుడు ఆ ప్రాంతంలో కరువు ఉంది. ప్రవక్తల బృందం ఎలీషాను కలుస్తున్నప్పుడు, అతడు తన సేవకునితో, “పెద్దకుండ పొయ్యిమీద పెట్టి ఈ ప్రవక్తలకు వంటకం చేయి” అన్నాడు.
39 One went out to the field to gather herbs and found a wild vine. He gathered a lapful of wild gourds from it, came back, and sliced them into the stew pot—no one knew what they were. వారిలో ఒకడు కూర ఆకుల కోసం పొలాలకు వెళ్లాడు, వెర్రి ద్రాక్ష అతనికి దొరికింది, దాని తీగెలు కోసి అతడు తన వస్త్రం నిండ నింపుకున్నాడు. అవి విషపూరితమైనవని అతనికి తెలియక వాటిని తరిగి కూర కుండలో వేశాడు.
40 They poured it out for the men to eat, but as they ate the stew they cried out, "Man of our Father, there is death in the pot!" They could not eat it. ఆ కూరను తినడానికి అక్కడ వారికి వడ్డించారు. వారు దానిని రుచి చూసి, “దైవజనుడా! కుండలో విషం ఉంది!” అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు.
41 He said, "Bring flour," threw it in the pot, and said, "Pour it out for the people to eat." Nothing harmful remained in the pot. ఎలీషా, “పిండి కొంచెం తీసుకురండి” అన్నాడు. అతడు పిండిని కుండలో వేసి, “ప్రజలు తినడానికి దానిని వారికి వడ్డించండి” అన్నాడు. అప్పుడు కుండలో హానికరమైనదేది లేదు.
42 A man from Baal-shalishah brought the man of our Father firstfruit bread—twenty barley loaves and fresh grain in his sack. Elisha said, "Give it to the people to eat." ఒక రోజు ఓ వ్యక్తి బయల్-షాలిషా నుండి దైవజనుని దగ్గరకు వస్తూ, ఒక సంచిలో తన ప్రథమ పంటలో యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలు, క్రొత్త ధాన్యం కంకులు కొన్ని తెచ్చాడు. అయితే ఎలీషా, “ప్రజలకు తినడానికి ఇవ్వు” అని చెప్పాడు.
43 His servant said, "How do I set this before one hundred men?" He said again, "Give it to the people to eat, for our Father says: They will eat and have leftovers." అయితే అతని సేవకుడు, “దీన్ని వందమందికి ఎలా పెట్టగలను?” అని అడిగాడు. అందుకు ఎలీషా, “ ‘వారు తినగా ఇంకా మిగలుతుంది’ అని యెహోవా చెప్పారు కాబట్టి నీవైతే వారికి వడ్డించు” అని అన్నాడు.
44 He set it before them; they ate and had leftovers, just as our Father said. అప్పుడు అతడు వారికి వడ్డించాడు, యెహోవా చెప్పిన మాట ప్రకారం అందరు తినగా కొంత మిగిలింది.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OTSA

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™ ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc. Biblica® Open Telugu Contemporary Version™ Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]