Skip to content
The Believer's Library

Indian Revised Version (IRV) Telugu - 2019

Lamentations 3 IRVTel

Show IRVTel only
Verse × ×
1 I am the man who has seen affliction under the rod of his wrath. నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి.
2 He has driven me away and made me walk in darkness without any light. ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు.
3 Surely against me he turns his hand again and again, all day long. నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు.
4 He has worn away my flesh and my skin; he has broken my bones. ఆయన నా మాంసం, నా చర్మం చీకిపోయేలా చేస్తున్నాడు, నా ఎముకలను విరగ్గొట్టాడు.
5 He has besieged me and surrounded me with bitterness and hardship. నాకు విరుద్ధంగా ముట్టడి కంచె నిర్మించాడు. క్రూరత్వం, కష్టం నా చుట్టూ ఉంచాడు.
6 He has made me dwell in darkness like those long dead. ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉండే చీకటి తావుల్లో నేను ఉండేలా చేశాడు.
7 He has walled me in so I cannot escape; he has weighed down my chains. ఆయన నా చుట్టూ గోడ కట్టాడు. నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు.
8 Even when I call out and cry for help, he shuts out my prayer. నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు.
9 He has blocked my ways with cut stones; he has made my paths crooked. ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు. నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు.
10 He is a bear lying in wait for me, a lion in hiding. నా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలా ఉన్నాడు. దాగి ఉన్న సింహంలా ఉన్నాడు.
11 He drove me off my path and tore me to pieces; he has made me desolate. నాకు దారి లేకుండా చేసి నన్ను చీల్చి చెండాడి నాకు దిక్కు లేకుండా చేశాడు.
12 He bent his bow and set me as the target for his arrow. విల్లు ఎక్కుపెట్టి బాణానికి గురిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు.
13 He drove the arrows of his quiver into my vitals. తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు.
14 I have become the laughingstock of all my people, their mocking song all day long. నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను. ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు.
15 He has filled me with bitterness; he has sated me with bitterness. చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు. విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు.
16 He has made my teeth grind on gravel, and made me cower in the dust. రాళ్లతో నా పళ్ళు విరగ్గొట్టాడు. బూడిదలోకి నన్ను అణగ దొక్కాడు.
17 My soul has lost all peace; I have forgotten what happiness is. నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు.
18 So I say, "My endurance has perished, and so has my hope from our Father." కాబట్టి నేను “నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు” అనుకున్నాను.
19 Remember my affliction and my wandering, the bitterness and the gall! నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను.
20 My soul continually remembers it and is bowed down within me. కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను.
21 But this I call to mind, and therefore I have hope: కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.
22 The covenant love of our Father never ceases; his mercies never come to an end; యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.
23 they are new every morning; great is your faithfulness. ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!
24 "Our Father is all I need," says my soul, "therefore I will hope in him." “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.
25 Our Father is good to those who wait for him, to the soul who seeks him. తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.
26 It is good to wait quietly for the salvation of our Father. యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది.
27 It is good for a man to bear the yoke in his youth. తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది.
28 Let him sit alone in silence when it is laid on him; అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగానూ, మౌనంగానూ కూర్చుని ఉండాలి.
29 let him put his mouth in the dust—there may yet be hope; ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి.
30 let him give his cheek to the one who strikes, and be filled with insults. అతడు తనను కొట్టేవాడివైపు తన చెంపను తిప్పాలి. అతడు పూర్తిగా అవమానంతో నిండి ఉండాలి.
31 For the Sovereign Father will not abandon forever. ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు.
32 Though he causes grief, he will have compassion according to the abundance of his covenant love; ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు.
33 for he does not willingly afflict or grieve people. హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు.
34 To crush underfoot all the prisoners of the earth, దేశంలో బందీలుగా ఉన్నవాళ్ళందరినీ కాళ్ల కింద తొక్కడం,
35 to deny a man justice in the sight of the Most High, మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం,
36 to deprive a man of justice in his case—the Sovereign Father does not approve. ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా?
37 Who has spoken and it came to pass, unless the Sovereign Father has commanded it? ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు?
38 Is it not from the mouth of the Most High that both calamity and good come? మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా?
39 Why should a living man complain about the punishment for his sins? బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు?
40 Let us examine and test our ways, and return to our Father! మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం.
41 Let us lift up our hearts and our hands to our Father in heaven: ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం.
42 "We have sinned and rebelled, and you have not forgiven. మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు.
43 You have wrapped yourself in anger and pursued us, killing without pity; నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు.
44 you have wrapped yourself with a cloud so that no prayer can pass through. మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు.
45 You have made us scum and refuse among the peoples. జాతుల మధ్య మమ్మల్ని విడనాడి, పనికిరాని చెత్తగా చేశావు.
46 All our enemies open their mouths against us; మా శత్రువులందరూ మమ్మల్ని చూసి నోరు తెరిచి ఎగతాళి చేశారు.
47 panic and pitfall have come upon us, devastation and destruction." గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి.
48 My eyes flow with streams of water over the destruction of my people. నా ప్రజల కుమారికి కలిగిన నాశనం నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతోంది.
49 My eyes will flow without ceasing, without respite, యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ,
50 until our Father looks down and sees from heaven. నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది.
51 My eyes bring grief to my soul at the fate of all the daughters of my city. నా పట్టణపు ఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది.
52 I have been hunted like a bird by those who were my enemies without cause; ఒకడు పక్షిని తరిమినట్టు నా శత్రువులు అకారణంగా నన్ను కనికరం లేకుండా తరిమారు.
53 they flung me alive into a pit and cast stones on me; వారు నన్ను బావిలో పడేసి నా మీద రాయిని పెట్టారు.
54 water closed over my head; I said, "I am lost." నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను.
55 I called on your name, my Father, from the depths of the pit; యెహోవా, అగాధమైన గుంటలోనుంచి నేను నీ నామాన్ని పిలిచాను.
56 you heard my plea: "Do not turn a deaf ear to my cry for help!" సాయం కోసం నేను మొర్ర పెట్టినప్పుడు నీ చెవులు మూసుకోవద్దు అని నేనన్నప్పుడు, నువ్వు నా స్వరం ఆలకించావు.
57 You came near on the day I called on you; you said, "Do not fear!" నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో “భయపడవద్దు” అని చెప్పావు.
58 You have taken up my cause, Sovereign Father; you have redeemed my life. ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు.
59 You have seen the wrong done to me, my Father; judge my cause. యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు.
60 You have seen all their vengeance, all their plots against me. నా మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు చేసే ఆలోచనలన్నీ నీకు తెలుసు.
61 You have heard their taunts, my Father, all their plots against me, యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు.
62 the lips and thoughts of my assailants against me all day long. నా మీదికి లేచిన వాళ్ళు పలికే మాటలు, రోజంతా వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు నీకు తెలుసు.
63 Watch their every move; I am the object of their mocking song. యెహోవా, వాళ్ళు కూర్చున్నా లేచినా, వాళ్ళు ఎగతాళిగా పాడే పాటలకు నేనే గురి.
64 You will repay them, my Father, according to the work of their hands. యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు.
65 You will give them hardness of heart; your curse will be on them. వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తావు. వాళ్ళను శపిస్తావు.
66 You will pursue them in anger and destroy them from under the heavens of our Father. యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

IRVTel

TEL-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Indian Revised Version (IRV) Telugu - 2019 · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]